ప్రభాస్-నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్.. డార్లింగ్ రేంజ్‌కు సరిపోయేలా.. నాటి క్లాసిక్‌ కథతో ..!!

బాహుబలి, సాహో చిత్రాలు ప్రభాస్ రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్‌లతో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. కేవలం ప్రభాస్ ఇమేజ్‌తో సాహో దాదాపు మూడు వందల కోట్లకు పైగా కొల్లగొట్టేసింది. అదీ డార్లింగ్ రేంజ్ అంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేశారు. అయితే ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం అప్‌డేట్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఆలస్యమవుతున్న ప్రాజెక్ట్..

ఆలస్యమవుతున్న ప్రాజెక్ట్..

జిల్ ఫేమ్ రాధాకృష్ణతో ప్రభాస్ ఓ పీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి మొదట జాన్ అనే టైటిల్ అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. రాధేశ్యామ్ గానీ ఓ డియర్ గానీ పరిశీలనలో ఉన్నట్లు టాక్. అదంతా పక్కన పెడితే.. ఈ మూవీ మాత్రం అనుకున్న టైమ్‌కు షూటింగ్ జరగ్గా.. వాయిదాలు పడుతూనే ఉంది.

అప్‌డేట్ కావాలంటూ ఫ్యాన్స్..

అప్‌డేట్ కావాలంటూ ఫ్యాన్స్..

ప్రభాస్ సినిమా అంటే అది నేషనల్ వైడ్ హాట్ టాపిక్కే. అలాంటి సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకుండా ఉంటే.. ఫ్యాన్స్ ఊరికే ఉంటారా. సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థపై ఫైర్ అవుతూ ఇష్టమొచ్చినట్లు బూతుల వర్షం కురిపిస్తున్నారు. తమకు ప్రభాస్ మూవీ అప్‌డేట్ కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అదిరిపోయే న్యూస్..

అదిరిపోయే న్యూస్..

మహానటితో దర్శకుడిగా నాగ్ అశ్విన్ ఓ రేంజ్‌కు వెళ్లాడు. అతను కథను ఎంత అందంగా తెరకెక్కిస్తాడో ఎంత మనసు పెట్టి చేస్తాడో మహానటి చిత్రాన్ని చూస్తేనే తెలుస్తోంది. అలాంటి దర్శకుడు ప్రభాస్‌తో సినిమా అంటే.. అది కూడా ప్యాన్ వరల్డ్ అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన క్షణం నుంచి కథ గురించి ఒకటో పుకార్లు పుట్టుకొచ్చాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి.

Recommended Video

Prabhas 21 : Nag Ashwin To Direct Prabhas | Vyjayanthi Movies || Filmibeat Telugu
టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో..

టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో..

అలాంటి పుకార్లలో ఒకటి మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. టైమ్ మిషన్.. కాలంలో ప్రయాణం నేపథ్యంలో కథ అనగానే తెలుగులో సూపర్ హిట్ సినిమా 'ఆదిత్య 369' అందరికీ గుర్తుకు వస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం బాలయ్య కెరీర్లోనే ఒక మరపురాని చిత్రం. ఆ మధ్య విక్రమ్ కుమార్- సూర్య '24' టైమ్ ట్రావెల్ నేపథ్యమే కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ వార్తలు నిజమో కాదో కానీ కాన్సెప్ట్ అయితే బాగుందని కామెంట్స్ వినిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X