For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ 'సినిమా' కష్టాలు..దోషం భయంతో నిర్మాతలు.. అందుకే అలా!

  |

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చిన్న సినిమాలు చేయడం లేదు. ఆయన చేస్తున్న అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నాయి. బాహుబలి తర్వాత సాహో అనే సినిమా చేసి రిలీజ్ చేయగా ఆ సినిమా అనుకున్నంత మేర ఆడలేదు. కలెక్షన్ల పరంగా నిర్మాతలకు ఎలాంటి నష్టం చేకూరక పోయినా టాక్ మాత్రం అంత బాలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ చేయబోతున్న అన్ని సినిమాల మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఆయన చేస్తున్న ఆదిపురుష్ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  ఆదిపురుష్ టీమ్‌ కి వరుస కష్టాలు

  ఆదిపురుష్ టీమ్‌ కి వరుస కష్టాలు

  సాహో సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ఈ సినిమా కరోనా కారణంగా లేట్ అవుతోంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఇంకా షూట్ చేయాల్సి ఉంది. ఈ సినిమా లైన్ లో ఉండగానే ఆయన మరో మూడు సినిమాలు అనౌన్స్ చేశారు. నాగ్అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా, బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్'‌, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ అన్ని సినిమాల విషయం పక్కన పెడితే ఆదిపురుష్ టీమ్‌ను మాత్రం వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి

  అగ్ని ప్రమాదం మొదలు

  అగ్ని ప్రమాదం మొదలు

  సినిమా మొదలయ్యాక అగ్ని ప్రమాదం మొదలు, మహారాష్ట్ర లాక్ డౌన్ దాకా అన్నీ ఇబ్బందులే. తాజాగా హైదరాబాద్‌లో షూటింగ్ ప్లాన్ చేసిన యూనిట్‌కు తెలంగాణలోనూ లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో మరో షాక్ తగిలినట్లు అయింది. నిజానికి సినిమా ప్రారంభమైన రోజే ఫైర్‌ యాక్సిడెంట్‌ కావటంతో షూటింగ్ ఆపేశారు. తరువాత ఆర్టిస్ట్‌ల డేట్స్ కుదరక షూటింగ్ షెడ్యూల్ అంతా గందరగోళంగా మారింది. ఇక షెడ్యూల్ కాస్త గాడిలో పడుతుందన్న సమయానికి ముంబైలో లాక్‌ డౌన్‌ పెట్టేశారు. ఈ దెబ్బకు ప్రభాస్‌ సహా మూవీ టీమ్‌ అంతా ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు.

  ప్రత్యేక హోమం

  ప్రత్యేక హోమం

  అయితే హైదరాబాద్‌లో ఆంక్షలు లేవు కాబట్టి ఇక్కడ చేద్దామని అనుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలో సెట్‌ కూడా రెడీ చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా లాక్‌ డౌన్ పెట్టేయటంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇక ఇవన్నీ చూసిన నిర్మాతలకు కొత్త అనుమానాలు మొదలయ్యాయని అంటున్నారు. అయితే ఈ కథ శ్రీరాముడి జీవితానికి సంబంధించిన సబ్జెక్టు కావడంతో ఆ వైపు నుంచి ఏదైనా దోషం ఉందేమోనని అనుమానిస్తున్నారని అంటున్నారు. దీంతో ఈ సమస్య తగ్గించుకోవడానికి ఈ సినిమా నిర్మాతలు ఏదైనా హోమం లాంటిది చేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

  బిగ్ బాస్ విన్నర్ ఆ పాత్రలో

  బిగ్ బాస్ విన్నర్ ఆ పాత్రలో

  ఓం రౌత్ డైరెక్షన్‌ లో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా సీతగా కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రావణ పాత్రలో కనిపించనుండగా.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ ఎంపికయ్యారు. ఇక తాజాగా మరో కీలక పాత్ర కోసం బిగ్ బాస్‌ విన్నర్ తో చర్చలు చేస్తున్నారట. హిందీ బిగ్‌బాస్‌ 13వ సీజన్‌ విజేత సిద్దార్థ్‌ శుక్లాను ఓ కీలక పాత్ర కోసం సంప్రదించారని అంటున్నారు. మేఘనాదుడు పాత్రలో ఆయన నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేదు.

  English summary
  Adipurush is an upcoming Indian mythological film directed by Om Raut and produced by T-Series Films. It is shot simultaneously in Telugu and Hindi languages, and to release in all the languages in india. Based on the Hindu epic Ramayana, Adipurush stars Prabhas as Lord Rama, Kriti Sanon as Sita, and Saif Ali Khan as Ravana. Film is facing lots of problems from first day it self. now some reports say that producers going to perform special pujas.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X