రెబల్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆదిపురుష్ నుంచి అదిరిపోయే అప్డేట్
టాలీవుడ్ టాప్ స్టార్ ప్రభాస్ గతంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అసలైతే బాహుబలి సినిమా తర్వాత మధ్య మధ్యలో చిన్న సినిమాలు కూడా చేయాలని అనుకున్నాడు. ముఖ్యంగా వందకోట్ల బడ్జెట్ సినిమాలు అయితే కంటిన్యూగా చేయవద్దని కూడా అనుకున్నాడు. కానీ బాహుబలి ఏదైతే అనుకున్నాడో అందుకు విరుద్ధంగానే జరుగుతోంది. బాహుబలి ఇచ్చిన మార్కెట్ కారణంగా అతనికి వచ్చే ఆఫర్స్ కూడా అలాగే వస్తున్నాయి. దర్శకనిర్మాతలు అతని మార్కెట్ ను ఏమాత్రం వదులుకోవద్దు అని భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.
కేవలం కమర్షియల్ యాక్షన్ సినిమాలు మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్ కు తగ్గట్లుగానే అన్ని రకాల జానర్స్ ను టచ్ చేస్తున్నాడు. ఆ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద తప్పకుండా ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేస్తాయని చెప్పవచ్చు. ఇక ఆ సినిమాలు స్టార్టింగ్ డదలోనే నేషనల్ లెవెల్లో అయితే భారీగా అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆది పురుష సినిమాపై హిందీ జనాల్లో కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటివరకు రామాయణం కథను ఎవరూ చూపించని విధంగా దర్శకుడు ఓం రావత్ త్రీడీ టెక్నాలజీతో సినిమాను తెరకెక్కించబోతున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు అనగానే ఆ ప్రాజెక్టు పై ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి.

ఇక సినిమాకు సంబంధించిన బిట్స్ విషయాల్లో కూడా చిత్ర యూనిట్ చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తోంది. దాదాపు సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులైతే ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రభాస్ పాత్రకు సంబంధించిన షెడ్యూల్ కేవలం 30 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అది పురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విడుదల చేస్తారట. దర్శకుడు ఓం రావత్ అయితే ఇప్పటికే ఆ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రాముడి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోంది. రీసెంట్ గా ఈ చిత్రం ఒక కీలకమైన షెడ్యూల్ ని ముంబైలో స్టార్ట్ చేసింది. పది రోజుల పాటు గ్యాప్ లేకుండా షూటింగ్ కొనసాగించే అవకాశం ఉందట. సినిమా విడుదల విషయానికి వస్తే వచ్చే ఏడాది ఆగస్టు 8న విడుదల చేయాలని అనుకుంటున్నారు. అసలైతే మొదట వచ్చే ఏడాది అనంతరం సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం కొంచెం సమయం ఎక్కువ అవుతుందని ఆగష్టు లోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక సలార్ సినిమా సమ్మర్ లో విడుదల అవుతుండగా రాధేశ్యామ్ జనవరి సంక్రాంతికి రానున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











