Prabhas: ఐదు నిమిషాలకే 60 కోట్లు.. ఇండియన్ సినీ హిస్టరీలోనే తొలిసారి ఇలా!

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభంలో తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం అయిన అతడు.. 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఇలా ఇప్పుడు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సాగుతున్నాడు.

దీంతో అతడు తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ప్రభాస్ ఖాతాలో ఓ అరుదైన ఘనత వచ్చి చేరింది. ఫలితంగా ఈ న్యూస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మీరూ చూడండి!

 బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌తో 'రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో అతడు మరిన్ని సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే 'ఆదిపురుష్' అనే చారిత్రక సినిమాలోనూ నటిస్తున్నాడు. దీంతో బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్నాడు. ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్‌లో రామయణం నేపథ్యంతో రూపొందుతోంది.

పాన్ వరల్డ్ రేంజ్.. ఎవరెవరు అంటే

పాన్ వరల్డ్ రేంజ్.. ఎవరెవరు అంటే

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో రెబెల్ స్టార్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను, దేవదుత్తా హనుమంతుడి పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మిస్తున్నారు.

షూటింగ్ పూర్తి.. దానికే ఎక్కువ టైమ్

షూటింగ్ పూర్తి.. దానికే ఎక్కువ టైమ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'ఆదిపురుష్' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోన్న సమయంలో కరోనా సెకెండ్ వేవ్ దానికి బ్రేక్ వేసింది. దీంతో ఆ మధ్య నిలిచిపోయిన ఈ సినిమా షూట్ టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఆ వెంటనే చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెట్టింది. గ్రాఫిక్స్ ఎక్కువ ఉండడం వల్ల దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని టాక్.

‘ఆదిపురుష్' విడుదల తేదీ ఫిక్స్

‘ఆదిపురుష్' విడుదల తేదీ ఫిక్స్

పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఐదో భాషల్లో ఇది తెరకెక్కుతోంది. ఇక, ఈ సినిమా విడుదలపై చాలా రోజులుగా ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని 2022 ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారని కొద్ది రోజుల క్రితమే ఓ న్యూస్ వైరల్ అయింది.

అన్ని కోట్లతో ఆదిపురుష్.. గ్రాఫిక్స్‌కే

అన్ని కోట్లతో ఆదిపురుష్.. గ్రాఫిక్స్‌కే

రామయణం నేపథ్యంతో తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్' మూవీ బడ్జెట్ గురించి చాలా రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారట. అందులో రూ. 100 కోట్లు కేవలం వీఎఫ్ఎక్స్ వర్క్స్‌కే కేటాయించారని తెలిసింది. ఇందుకోసం ఓ బడా సంస్థ వర్క్ చేస్తుందట.

ఐదు నిమిషాలకే అరవై కోట్లు బడ్జెట్

ఐదు నిమిషాలకే అరవై కోట్లు బడ్జెట్

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్' మూవీ గురించి ఏది బయటకు వచ్చినా దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. దీంతో ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇలాంటి పరిస్థితుల్లో దీని గురించి బయటకు వచ్చిన ఓ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఓ సీన్ కోసం ఏకంగా రూ. 60 కోట్లు ఖర్చు చేసిందట చిత్ర యూనిట్.

ఇండియన్ సినీ హిస్టరీలోనే తొలిసారి

ఇండియన్ సినీ హిస్టరీలోనే తొలిసారి

ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీలో ఐదు నిమిషాల పాటు సాగే ఓ సన్నివేశం హైలైట్ కాబోతుందట. దీనికి కారణం ఈ సీన్ కోసం చిత్ర యూనిట్ ఏకంగా రూ. 60 కోట్లు ఖర్చు చేసిందట. అయితే, అది ఏ సీన్? ఎప్పుడు వస్తుంది? అనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. మొత్తానికి చిన్న సీక్వెన్స్‌కు ఎక్కువ ఖర్చు చేసిన చిత్రంగా మాత్రం ఇది ఘనతను దక్కించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X