అన్నీ తానై ప్రభాస్.. సక్సెస్ అయిందంటే ఆ రేంజ్ మాములుగా ఉంటుందా?

Recommended Video

Prabhas Involves In Sahoo Making,Gives Advises To Director Sujeeth || Filmibeat Telugu

బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షుకుల చూపు ప్రభాస్‌పై పడింది. బాలీవుడ్ రేంజ్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా టాలీవుడ్ లోనూ సినిమాలు తీయగలమని ఈ సినిమా ద్వారా నిరూపించారు రాజమౌళి. ఈ సినిమా తెచ్చిన క్రేజ్ ప్రభాస్ అభిమాన వర్గాన్ని అందలమెక్కించింది. దీంతో అందరి చూపు ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై పడింది. ఈ మేరకు ప్రభాస్ కూడా చాలా గ్యాప్ తీసుకొని సాహూ సెట్స్‌పై చేరారు. అయితే ఈ సినిమా విషయంలో కేవలం హీరోగానే గాక అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట యంగ్ రెబల్ స్టార్. వివరంగా చూస్తే..

 మరో భారీ ప్రాజెక్ట్‌తో..

మరో భారీ ప్రాజెక్ట్‌తో..

బాహుబలి విజయం ఇచ్చిన స్పూర్తితో సాహూ రూపంలో భారీ ప్రాజెక్టు చేపట్టారు ప్రభాస్. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 250 కోట్లకు పైగా బడ్జెట్‌‌తో ఈ సినిమా రూపొందుతోంది.

ప్రభాస్ సపోర్ట్..

ప్రభాస్ సపోర్ట్..

భారీ బడ్జెట్ మూవీ కావడం పైగా అనుభవం లేని డైరెక్టర్ కావడంతో సాహూకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ప్రభాస్ తీసుకుంటూ డైరెక్టర్ సుజీత్‌కి తన వంతు సహకారం చేస్తున్నారట. ఈ మేరకు సుజీత్ కూడా ప్రభాస్ ఇచ్చిన సూచనలు పాటిస్తూ సినిమాను హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

సరైందేనా అనే టాక్

సరైందేనా అనే టాక్

ఇప్పటివరకూ ప్రభాస్ నటించిన ఏ సినిమా విషయంలోనూ ఆయన ఇన్వాల్వ్ అయింది లేదు. అలాంటిది మొదటిసారి సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న సాహూపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం విశేషం. ఎక్కువ మంది దీనిని స్వాగతిస్తున్నప్పటికీ ఓ హీరో, డైరెక్టర్‌కి సూచనలివ్వటం సరైందేనా అనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఏది ఏమైనా హిట్ పడితే ఏమాత్రం

ఏది ఏమైనా హిట్ పడితే ఏమాత్రం

కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్.. సాహో హిట్ అయిందంటే మాత్రం ఒక్కసారిగా పెద్ద డైరెక్టర్ల చెంతచేరతాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే తన మొదటి సినిమా రన్ రాజా రన్‌తో మంచి స్టఫ్ ఉన్న డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుజీత్‌కి సాహో విజయం అంబరాన్ని ఎక్కించడం ఖాయం. చూడాలి మరి ప్రభాస్ సహకారంతో సుజీత్ ఎలాంటి హిట్ కొట్టనున్నాడో.

సాహూ మూవీ

సాహూ మూవీ

ఇక సాహూ సినిమా విషయానికొస్తే ప్రభాస్ కెరీర్ లో బాహుబలి తర్వాత మరో భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ టాలీవుడ్ గడప తొక్కుతోంది. చిత్రంలో ప్రభాస్ తో పాటుగా శ్రద్దా కపూర్ కూడా భారీ యాక్షన్ సీన్స్ లో కనిపించనుండటం విశేషం. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X