ప్రభాస్‌ను అనుష్కను కలిపేందుకు భారీ స్కెచ్.. గుట్టుగా సెట్ చేస్తున్న యంగ్ హీరో!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది అనుష్క. అంతా ఫేమస్ అయింది ఈ జోడీ. ప్రభాస్- అనుష్క జోడీ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి యువలోకం ఫిదా అయింది. బయటకూడా ఈ ఇద్దరూ బాగా క్లోజ్ గా ఉండటంతో వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే చర్చలు జోరందుకున్నాయి.
పైగా ఇద్దరూ మోస్ట్ ఎలిజిబుల్ క్యాచిలర్స్ కావడంతో త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి అనే విషయాలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అనుష్కను ప్రభాస్ భార్య చేయాలని మంచు వారబ్బాయి మంచు విష్ణు పూనుకోవడం జనాల్లో హాట్ టాపిక్ అయింది. గుట్టుగా ఉంచిన ఆ విషయం బయటపడింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రభాస్- అనుష్క.. ఆ క్రేజే వేరు:
పెళ్లి చేసుకోలేదు గానీ పెళ్ళైన సెలబ్రిటీ జంటల కంటే ఎక్కువ క్రేజ్ కొట్టేశారు ప్రభాస్- అనుష్క. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ జోడీ పేరు వినబడితేనే పూనకాలు వచ్చేస్తుంటాయి. అలాంటి ఈ ఇద్దరికీ భార్యాభర్తలుగా చేయబోతున్నారట మంచు విష్ణు. ఎస్ ఇది నిజమే. పక్కా ప్లానింగ్‌తో మంచు విష్ణు ఇరువురి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేయబోతున్నారట.

ప్రభాస్- అనుష్క జోడీ.. టాప్ ప్లేస్
ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో జత కట్టిన ప్రభాస్- అనుష్క జోడీ బాహుబలి సిరీస్ తో యమా క్రేజ్ కొట్టేసింది. బిల్లా, మిర్చి, బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల్లో వీరి జోడి చూసి ముచ్చటపడిపోయారు ఆడియన్స్. అలా వెండితెరపై మ్యాజిక్ చేసే జంటల్లో టాప్ ప్లేసులో నిలిచింది ఈ మోస్ట్ ఎలిజిబుల్ క్యాచిలర్స్ జోడీ.
మంచు విష్ణు స్కెచ్ అదుర్స్:
ఈ నేపథ్యంలో మరోసారి సిల్వర్ స్క్రీన్ పై ఈ జంట కనిపించనున్నారని తెలుస్తుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం మంచు విష్ణు అని సమాచారం. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్పలో ప్రభాస్- అనుష్క జోడీతో పక్కా ప్లాన్ చేశారట మంచు విష్ణు.

భారీ హంగులతో కన్నప్ప:
రూ.100 కోట్ల బడ్జెట్ తో భారీ హంగులతో కన్నప్ప సినిమా రూపొందిస్తున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకు హైప్ రెట్టింపవుతోంది. స్టార్ కాస్టింగ్ తీసుకుంటూ ఊహించిన దానికంటే మిన్నగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్, అనుష్కలను భాగం చేస్తూ.. ఈ ఇద్దరినీ భార్యాభర్తలుగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











