ప్రభాస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్: క్రేజీ మూవీ వాయిదా.. మరీ అంత ఆలస్యమా!
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న బడా హీరోల్లో ముందుగా పాన్ ఇండియా స్టార్ అనే పేరును తెచ్చుకుంది యంగ్ రెబెల్ స్టార్ ప్రభాసే అన్న విషయం తెలిసిందే. దీనికి ఏమాత్రం తీసిపోకుండా అతడు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలతో అలరించాడు. కానీ, వరుసగా అతడి పరాజయాలే ఎదురు అవుతున్నాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇప్పుడు ప్రభాస్ 'సలార్', 'ప్రాజెక్టు K', 'స్పిరిట్'తో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ మారుతితోనూ ఓ సినిమాను చేస్తోన్నాడు.
ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేస్తున్న మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని ఇప్పటికే వార్తలు లీక్ అయ్యాయి. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా ఎంతో సీక్రెట్‌గా సాగుతోంది. ఇందుకోసం ఓ బూత్ బంగ్లా సెట్‌ను నిర్మించి, అందులో షూటింగ్‌ను జరుపుకుంటోన్నారు. ఇలా ఇప్పటికే దాదాపుగా 50 శాతానికి పైగా టాకీ పార్టును పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకునేలా చిత్ర యూనిట్ ప్లాన్లు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

ప్రభాస్ - మారుతి కాంబోలో హర్రర్ కామెడీ మూవీగా రాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ అప్పుడు విడుదల కావడం లేదని తెలిసింది. 'సలార్' ఫస్ట్ పార్ట్ ఈ సెప్టెంబర్‌లో, రెండోది వచ్చే వేసవికి విడుదల కాబోతున్నాయి. దీంతో మారుతి చిత్రాన్ని కాస్త ఆలస్యంగా తీసుకు రావాలని ప్రభాస్ డిసైడ్ అయినట్లు తెలిసింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివర్లో అంటే నవంబర్‌లో లేదా డిసెంబర్‌లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

అదిరిపోయే కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చింది. అలాగే, ఇందులో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











