ప్రభాస్ సినిమా కోసం మరో స్టార్: భయపెట్టేందుకే ఆయనతో స్పెషల్ ప్లాన్

సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమా చేయాలంటే ఏడాది అయినా సమయం పడుతుంది. కానీ, టాలీవుడ్‌లోని ఒకే ఒక్క స్టార్ హీరో మాత్రం ఏకకాలంగా నాలుగైదు ప్రాజెక్టులు చేస్తూ అందరికీ షాకిస్తోన్నాడు. అతడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న అతడు.. ఇప్పుడు 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్టు K', 'స్పిరిట్', సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో ఓ భారీ యాక్షన్ మూవీని ప్రకటించాడు. వీటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. వీటితో పాటు మారుతితోనూ ప్రభాస్ సినిమా చేస్తోన్నాడు.

వరుస చిత్రాలతో తీరక లేకుండా గడుపుతోన్న ప్రభాస్.. ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతితో కలిసి 'రాజా డీలక్స్' (పరిశీలనలో ఉన్న పేరు) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని ఇప్పటికే వార్తలు లీక్ అయ్యాయి. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా ఎంతో సీక్రెట్‌గా సాగుతోంది. ఇందుకోసం ఓ బూత్ బంగ్లా సెట్‌ను నిర్మించి, అందులో షూటింగ్‌ను జరుపుకుంటోన్నారు. ఇలా ఇప్పటికే దాదాపుగా 60 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

Prabhas and Maruthi Movie Unit Talks With Ajaneesh Loknath

హర్రర్ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌ ఎవరు అన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. దీనికి దాదాపుగా థమన్ కన్ఫార్మ్ అవుతాడని ఆ మధ్య న్యూస్ వచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కోసం కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అంజనీష్ లోక్‌నాథ్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ మధ్య కాలంలో అతడు 'కాంతార', 'విక్రాంత్ రోణ', 'విరూపాక్ష' వంటి హర్రర్ చిత్రాలకు భయపెట్టే సౌండ్స్ ఇచ్చాడు. అందుకే ప్రభాస్ సినిమాకు ఆయనను తీసుకోవాలని భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని సమాచారం.

Prabhas and Maruthi Movie Unit Talks With Ajaneesh Loknath

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతి కలయికలో రాబోతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు లీక్ అయ్యాయి. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X