The Raja Saab: ప్రభాస్ నుంచి డబుల్ సర్‌ప్రైజ్.. రాజా సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్
రెబెల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా అతడు చాలా కాలంగా పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతూ భారీ చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానుల అలరిస్తున్నాడు. అదే సమయంలో కోట్ల వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ బెండు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' మూవీతో భారీ హిట్‌ను అందుకున్నాడు.
'సలార్: సీజ్‌ఫైర్' హిట్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చేసిన రెబెల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు తన కొత్త సినిమాలపై ఫోకస్ చేశాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే పట్టాలెక్కించిన పలు ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు. అందులో టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందించే మూవీ ఒకటి. 'ది రాజా సాబ్' అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

రెబెల్ స్టార్ ప్రభాస్ - మారుతి కాంబోలో హర్రర్ కామెడీతో రాబోతున్న 'ది రాజా సాబ్' సినిమాను సీక్రెట్‌గానే మొదలు పెట్టి చాలా షెడ్యూళ్లను జరుపుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి 40 శాతం వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్లు చేసుకుంటోంది.
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'ది రాజా సాబ్' సినిమా రిలీజ్ గురించి చాలా రోజులు నుంచి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీన్ని 2024లోనే విడుదల చేస్తారని, కాదు కాదు 2025లో తీసుకు వస్తారని టాక్స్ వినిపించాయి. దీంతో ప్రభాస్ అభిమానులు అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా 'ది రాజా సాబ్' రిలీజ్ డేట్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న 'ది రాజా సాబ్' మూవీని ఈ ఏడాది డిసెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారట. 'కల్కి 2898 ఏడీ' సినిమా పూర్తైన తర్వాత నుంచి ప్రభాస్ ఈ మూవీ షూట్‌లో పాల్గొని కంప్లీట్ చేయబోతున్నాడట. అలా ఈ చిత్రం ఈ ఏడాదిలోనే తీసుకు వస్తున్నారు. అంటే చాలా ఏళ్ల తర్వాత అతడి నుంచి ఒకే సంవత్సరంలో రెండు చిత్రాలు రాబోతున్నాయన్న మాట.
ఇదిలా ఉండగా.. 'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











