సైడైన నాగ్ అశ్విన్.. ప్రభాస్ లైన్‌లోకి ప్రశాంత్ నీల్.. క్రేజీ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం!!
ప్రస్తుతం నేషనల్ స్టార్ ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. ప్రభాస్ డైరీ వచ్చే రెండేళ్ల వరకు ఖాళీనే లేదు. ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తరువాత నాగ్ అశ్విన్ సినిమా చేయాల్సింది. కానీ మధ్యలోకి ఆదిపురుష్ వచ్చింది. దాని తరువాత అయినా నాగ్ అశ్విన్ సినిమా ఉంటుందా? అంటే అది అనుమానంగానే మారింది. తాజాగా ప్రభాస్ మరో ప్యాన్ ఇండియన్ మూవీ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

ప్రభాస్ ప్యాన్ ఇండియా సినిమాలు..
బాహుబలి తరువాత ప్రభాస్ ఇమేజ్ ఎక్కడి వరకు వెళ్లిందో అందరికీ తెలిసిందే. సాహె సినిమాతో ఉత్తరాదిలో ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ ఏంటో తెలిసిందే. అలా ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ ప్యాన్ ఇండియన్ లెవెల్‌లోనే ఉండేలా చూసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

అందుకే అలా..
అందుకు ప్రభాస్ స్టార్డంకు తగ్గట్టే నాగ్ అశ్విన్ మొదటగా ఓ ప్యాన్ వరల్డ్ కథను రెడీ చేశాడు. సైంటిఫిక్ ఫిక్షన్, టైం మిషన్ కథతో ఈ చిత్రం ఉండబోతోందని అప్పట్లో టాక్ బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తుండగా.. అమితాబ్ కూడా ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. మామూలుగా అయితే ఈ మూవీ రాధేశ్యామ్ తరువాత పట్టాలెక్కాల్సింది.

మధ్య ఆదిపురుష్...
అయితే నాగ్ అశ్విన్ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా టైం పట్టడం, ఆ మూవీ బల్క్ డేట్స్ అవసరం వస్తుండటంతో ఆ గ్యాప్‌లో ఆది పురుష్ ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆది పురుష్ ముందు పట్టాలెక్కుతుందని అందరూ భావించారు. కానీ మళ్లీ ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ప్రశాంత్ నీల్ చిత్రంతో...
అయితే ప్రభాస్ అటు ఆదిపురుష్ ఇటు నాగ్ అశ్విన్ చిత్రం కాకుండా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తోన్నట్టు సమాచారం. ప్రశాంత్ నీల్ తన మొదటి సినిమా ఉగ్రం రీమేక్‌ను ప్రభాస్‌తో తెరకెక్కిస్తాడని, ఈ మూవీ కోసం ప్రభాస్‌ను తక్కువ కాల్ షీట్స్ అడగడంతో ఓకే అన్నాడని తెలుస్తోంది.
Recommended Video

ఆ ప్రకటనతో అంచనాలు..
అంతే కాకుండా KGFను నిర్మించిన హొంబళే ప్రొడక్షన్స్ సంస్థ చేసిన ప్రకటన ఇందుకు ఊతమిస్తోంది. ప్రియమైన సినీ ప్రేక్షకులారా.. మీరే సినిమాలను మాకంటే బాగా ఇష్టపడుతుంటారు. మాపై చూపిస్తున్న ప్రేమను కొనసాగించుకునేందుకు మేము త్వరలోనే ఓ ఇండియన్ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాము. మా ప్రకటన కోసం డిసెంబర్ 2 వరకు వేచి ఉండండి అంటూ ట్వీట్ చేసింది. దీంతో అది ప్రభాస్ ప్రశాంత్ నీల్ సినిమా అని అందరూ ఫిక్స్ అయ్యారు. మరి అసలు సంగతి తేలాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











