TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
అలా చేస్తే 'దేవుళ్లే': చెర్రీ-ప్రభాస్‌లు నిజంగా అందుకు సిద్దపడుతున్నారా?..

అప్పులు చేసి.. అష్టకష్టాలు పడి సినిమాలు నిర్మిస్తే.. చివరికి వాటిని విడుదల కూడా చేసుకోని దుస్థితి చిన్న సినిమాలను చాలా కాలంగా వెంటాడుతోంది. చిన్న సినిమాలకు అనుకూలంగా మినీ థియేటర్లు నిర్మిస్తామని ప్రభుత్వాలు చెప్పినప్పటికీ.. ఆ హామి ఆచరణకు నోచుకోవడానికి ఇంకెంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి.
థియేటర్ల గుత్తాధిపత్యంపై చర్చ జరిగినప్పుడల్లా ఇండస్ట్రీలో నలుగురు పెద్దల పేర్లు ప్రముఖంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయినా సరే, ఈ విషయంలో అటు ప్రభుత్వం కానీ ఇటు సినీ పెద్దలు కానీ ఇప్పటివరకు చిన్న నిర్మాతల ప్రయోజనాల కోసం చేసిందేమి లేదు. అలాంటిది.. ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం చిన్న నిర్మాతల కోసం నడుం కట్టినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎవరా ఇద్దరు?:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ఈ ఇద్దరూ కలిసి థియేటర్స్ బిజినెస్ లోకి దిగుతున్నారట. కొన్ని థియేటర్లను లీజుకు తీసుకుని.. వాటిల్లో చిన్న సినిమాల విడుదలకు చొరవ చూపుతారట. నష్టాల పాలవుతున్న చిన్న నిర్మాతలను ఆదుకోవడానికే ఈ ఇద్దరు థియేటర్ బిజినెస్ లోకి దిగుతున్నట్లు చెబుతున్నారు.
ఆ మేలు చేస్తే.. దేవుళ్లే:
ఓ ఏడాదిలో విడుదలయ్యే పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలే ఎక్కువ. అయినా సరే, చిన్న సినిమాకు థియేటర్స్ దొరకాలంటే పైరవీలు చేయక తప్పని పరిస్థితి. థియేటర్లు ఓకె అయినా సరే.. విడుదల తేదీ వరకు నమ్మకం లేని పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయి.
ఒక్కోసారి తీరా రిలీజ్ రోజు.. థియేటర్స్ ఇవ్వమని చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చిన్న సినిమాల మేలు కోరి ప్రభాస్, చెర్రీ ఈ బిజినెస్ ను ఎంచుకున్నారని చెబుతున్నారు. నిజంగా చెర్రీ, ప్రభాస్ ఈ పని చేస్తే గనుక.. చిన్న సినిమాల పాలిట వాళ్లు దేవుళ్లే అని చెప్పాలి.
కానీ సాధ్యమేనా?:
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లలో ఎక్కువ శాతం థియేటర్లు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు వంటి వారి చేతుల్లోనే ఉన్నాయి. ఏళ్లకేళ్లు వారే లీజులకు తీసుకుని వాటిని నడిపిస్తున్నారు. ఇప్పుడు రాంచరణ్, చెర్రీలకు థియేటర్స్ కావాలంటే ఆ నిర్మాతల చేతిలోంచి వీరి చేతిలోకి రావాలి. అది అయ్యే పనేనా? అంటే కాదనే చెప్పాలి.
ఇలా చేస్తే సాధ్యమే?
నిజంగా చిన్న సినిమాలకు గనుక వీరిద్దరు మేలు చేయాలనుకుంటే.. 300మంది కెపాసిటీతో విజయవాడ బస్టాండులో నిర్మించినటువంటి మినీ థియేటర్స్ వీరే సొంతంగా నిర్మిస్తే తప్ప చిన్న సినిమాలకు మేలు జరగదు. మరి చెర్రీ, ప్రభాస్ నిజంగా మినీ థియేటర్స్ నిర్మించి చిన్న నిర్మాతలకు బాసటగా నిలుస్తారా? లేక.. ఇవన్నీ కేవలం ఊహాగానాలకే పరిమితమవుతాయా? అన్నది వేచి చూడాల్సిందే.
ఇలా తెర పైకి ఊహాగానాలు
ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న 'రంగస్థలం' నైజాం రైట్స్‌ను సొంతం ప్రభాస్ యూవి క్రియేషన్స్ సొంతం చేసుకుంది. ఈ సంస్థ చిన్న సినిమాలు కూడా నిర్మిస్తోంది. రాంచరణ్ ఎలాగూ నిర్మాణ రంగంలోకి దిగాడు. అతడూ చిన్న సినిమాలు తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు థియేటర్ బిజినెస్ లోకి దిగుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు దీనిపై అటు నుంచి మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు.