మరో విధ్వంసానికి సందీప్ రెడ్డి.. ప్రభాస్‌ స్పిరిట్‌ ఎప్పుడంటే..?

Spirit movie: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. బాక్పాఫీస్ ను షేకాడించి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. ఇండస్ట్రీ సెన్సేషనల్ గా నిలిచింది. ఆ మూవీనే పలు భాషలలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఘనత సందీప్ రెడ్డి వంగాకే దక్కుతుంది. ఆ తర్వాత ఏకంగా బాలీవుడ్ లో అడుగుపెట్టి 'యానిమల్' అనే కల్డ్ మూవీ తీసి.. బాక్సాఫీస్ వద్ద రచ్చ చేశాడు. ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' అనే మూవీని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగవైరల్ అవుతోంది. ఇంతకీ సంగతేంటంటే.?

ఇక పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే.. సలార్​, కల్కి 2898 ఏడీ లాంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్న డార్లింగ్ ప్రభాస్ పుల్ జోష్ లో ఉన్నారు. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ.. బ్యాక్‌ టు బ్యాక్‌ సక్సెస్ ను అందుకుంటున్నారు ప్రభాస్. డార్లింగ్ సినిమా లైన్ అప్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మల్సిందే. వరుస కమిట్మెంట్లను చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకు వెళ్తున్న ప్రభాస్.. ప్రస్తుతం ' రాజాసాబ్' అనే హర్రర్‌ కామెడీ సినిమాతో ముందుకు రాబోతున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయింది. ఈ మూవీని ఏప్రిల్ లేదా జూన్ ప్రారంభంలో విడుదల చేయబోతున్నారనే టాక్ వస్తుంది.

Prabhas and Sandeep Reddy Vanga s Spirit to Begin Filming This March

రాజాసాబ్ షూటింగ్ పూర్తికావడంతో.. హను రాఘవపూడి డైరెక్షన్​ లో వస్తున్న ' ఫౌజీ 'సినిమాను లైన్ లో పెట్టనున్నారు. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతుంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొన్నారట. మరో రెండు వారాల పాటు షూటింగ్‌ జరుగుతుందని, దాంతో సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అవుతాయని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ తన వింటేజ్‌ లుక్‌తో కనిపించబోతుండటంతో సినిమాపై కూడ భారీగా అంచనాలు పెరిగాయి.

ఈ మూవీ తరువాత 'స్పిరిట్‌'(Spirit) సినిమా షూటింగ్ లో పాల్గొన అవకాశముంది. ప్రభాస్‌ హీరోగా డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్‌' సినిమా ప్రీప్రోడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ను మార్చ్ లో ప్రారంభించాలని యూనిట్‌ ప్లాన్‌ చేస్తోందని సమాచారం. ప్రభాస్‌ తన కెరీర్ తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఇందు కోసం ప్రభాస్ లుక్స్, ఫిజిక్‌ పరంగా స్పెషల్‌ మేకోవర్‌ కు సిద్దం కానున్నారు.

'స్పిరిట్‌' షూటింగ్ అనుకున్న సమయాని కన్నా కాస్త ఆలస్యం గా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయంట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్, ఆలియా భట్, రష్మికా మందన్నా..తదితర స్టార్ హీరోయిన్ ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే.. వారితో ఎవరూ కూడా ఫైనలేజ్‌ కాలేదట. టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్‌ నిర్మించనున్న 'స్పిరిట్‌'మూవీ 2026 చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే.. సందీప్ మ్యూజిక్ సిట్టింగ్ లతో పాటు, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X