Prabhas25: ఆరోజున ఫ్యాన్స్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌తో సినిమా

సీనియర్ హీరో కృష్ణంరాజు కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభంలో తెలుగులో మాత్రమే సినిమాలు చేసిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత నుంచి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతేకాదు, ఏక కాలంలో వరుసగా అన్నీ భారీ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోన్న ప్రభాస్.. తన 25వ సినిమాను సైతం లైన్‌లో పెట్టుకున్నాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రకటనపైనా ఓ వార్త వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

తొలిసారి అలాంటి పాత్రలో ప్రభాస్

తొలిసారి అలాంటి పాత్రలో ప్రభాస్

ప్రస్తుతం ప్రభాస్. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రమే 'రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ మూవీలో ప్రభాస్ రొమాంటిక్ రోల్‌లో నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

అన్నీ మొదలు... ముందు వీటితోనే

అన్నీ మొదలు... ముందు వీటితోనే

'రాధే శ్యామ్' షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్.. నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాను ప్రకటించాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ దీన్ని నిర్మిస్తున్నారు. దీని తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే హిందీ చిత్రాన్ని, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే మూవీ ప్రకటించాడు. కానీ, దాని కంటే ముందే ఈ రెండు చిత్రాలను ప్రారంభించాడు.

పాన్ వరల్డ్ రేంజ్‌.. అదే కాన్సెప్టుతో

పాన్ వరల్డ్ రేంజ్‌.. అదే కాన్సెప్టుతో

నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో ప్రభాస్ చేసే మూవీ పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందనుంది. ఇందులో అమితాబ్ కీలక పాత్రను పోషిస్తుండగా.. దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. ఇక, సినిమా టైం మెషీన్‌ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కబోతుందనే టాక్ వినిపించింది. దీంతో బాలయ్య నటించిన 'ఆదిత్య 369'కు ఇది సీక్వెల్ అంటున్నారు. ఇది వచ్చే ఏడాది మొదలు కానుంది.

24వ సినిమా ఆ బాలీవుడ్ డైరెక్టర్‌తో

24వ సినిమా ఆ బాలీవుడ్ డైరెక్టర్‌తో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే పలు చిత్రాలను మొదలు పెట్టిన ఈ స్టార్ హీరో.. తన 24వ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీన్ని బాలీవుడ్ డైరెక్టర్ 'వార్' ఫేం సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుందని తెలిసింది.

ప్రభాస్ 25వ సినిమా ప్రకటన డేట్

ప్రభాస్ 25వ సినిమా ప్రకటన డేట్

కొంత కాలంగా ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సినిమా మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన 25వ సినిమాను కూడా ఫిక్స్ చేసుకున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అక్టోబర్ 7న వెలువడనుందని తెలిసింది.

25వ సినిమా కోసం స్పెషల్ కాన్సెప్ట్

25వ సినిమా కోసం స్పెషల్ కాన్సెప్ట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించే 25వ సినిమాను స్పెషల్‌గా రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఎక్కడా రాని కాన్సెప్టుతో ఈ మూవీ తెరకెక్కనుందట. ఇందులో ప్రభాస్ పాత్ర కూడా ఎంతో కొత్తగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం స్టోరీ లైన్ కూడా రెడీ అయిపోయిందని అంటున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.

Recommended Video

Prabhas Launched Kalakhar Teaser కళాకార్ టీజర్ లాంచ్ | Rohith
దేశమే గర్వించే దర్శకుడితో మూవీ

దేశమే గర్వించే దర్శకుడితో మూవీ

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించబోయే 25వ సినిమాను ఇండియాలోనే టాప్ డైరెక్టర్ తెరకెక్కిస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయట. ఇక, ఈ మూవీ 2024లో ప్రారంభం అవుతుందని కూడా ఓ టాక్ వినిపిస్తోంది. అంటే 7వ తేదీ వరకూ ఆగితే మొత్తం తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X