మరొక ఆర్మీ కథకు ఓకే చెప్పిన ప్రభాస్.. దర్శకుడు ఎవరో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలు, భారీ స్కేల్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి, సలార్, కల్కి 2898 ఏడీ వంటి చిత్రాల తర్వాత ప్రభాస్ సినిమాలపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఆయన చిత్రాలకు ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ భారీ మార్కెట్ ఉంది. అయితే ప్రభాస్ కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకు ఎప్పుడూ ఒకే తరహా సినిమాల్లో కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం పోలీస్, ఆర్మీ కథలకు ఓకే చెబుతూ వస్తున్నారు. ఇక తాజాగా కోలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో ప్రభాస్ మరో ఆర్మీ కథను ఫైనల్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
ఇప్పటికే 2 పోలీసులు కథలు..
ప్రభాస్ ఇప్పటికే రెండు పోలీసు సంబంధింత కథలను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. ఒక సీతారామం సినిమా దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తూ ఉంటే.. మరొకటి అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇప్పటికే ఫౌజీ చిత్రం ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంటున్నారు. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్, చిన్న చిన్న సీన్లతో ప్రభాస్ షూటింగ్ పార్ట్ ముగుస్తుందని తెలుస్తోంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రావాల్సిన స్పిరిట్ పై ఫోకస్ చేయనున్నారు.

కోలీవుడ్ దర్శకుడితో మరో ఆర్మీ కథ..
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో కథను ప్రభాస్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. దానిపై పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రభాస్ ఇటీవల కోలీవుడ్ డైరెక్టర్, బ్లాక్ బస్టర్ మూవీ అమరాన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియార్ స్వామి చెప్పిన కథ విన్నారని తెలుస్తుంది.
అయితే ఆయన కూడా ప్రభాస్ కు ఆర్మీ రిలేటెడ్ కథ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ప్రభాస్ కు కూడా ఆ కథ బాగా నచ్చిందంట. దీంతో మరొకసారి నేరేషన్ ఇవ్వమని అడిగారంట. దాని తర్వాత సినిమాను లాక్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ప్రకటన అంటే ఏదీ లేదు. ఈ ప్రాజెక్టు ఓకే అయితే యువీ క్రియేషన్ బ్యానర్ లో రూపుదిద్దు కోనుందని అంటున్నారు.
ప్రభాస్ రాబోయే చిత్రాలు..
నెక్ట్స్ ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రాజా సాబ్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ప్రభాస్ ఫౌజీ చిత్రంతో థియేటర్లలోకి రానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ప్రభాస్ నుంచి కల్కి 2898 ఏడీ సీక్వెల్, సలార్ 2 వంటి చిత్రాలు రూపుదిద్దుకోవాల్సి ఉంది. ఇక మరోవైపు లోకేష్ కగరాజ్, ప్రశాంత్ వర్మ, దిల్ రాజ్ తో సినిమాలు ఓకే అయ్యాయి ఉన్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











