Prabhas కెరీర్ లోనే మరో బిగ్ ప్రాజెక్ట్.. ఆ హాలీవుడ్ నిర్మాణ సంస్థతో చర్చలు?

రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల కాలంలో ఎలాంటి సినిమాలు మొదలు పెట్టినా కూడా ఫ్యాన్ ఇండియా అంచనాలను దాటి పాన్ వరల్డ్ సినిమాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా అనంతరం ఒక్కసారిగా తన క్రేజ్ ను అమాంతం గా పెంచుకున్న డార్లింగ్ 2025 వరకు చాలా బిజీగా ఉండే విధంగా సినిమాలను లైన్ లో పెట్టడం విశేషం. అయితే ప్రస్తుతం ఒక హాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రభాస్ తో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రభాస్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఒక టాక్ అయితే నడుస్తోంది ఆ వివరాల్లోకి వెళితే..

డిజాస్టర్స్ ఎదురైనా..

డిజాస్టర్స్ ఎదురైనా..

దర్శకధీరుడు రాజమౌళి తో బాహుబలి సినిమా చేసిన అనంతరం ప్రభాస్ అయితే అసలు గ్యాప్ తీసుకోవడం లేదు. కరోనా కారణంగా మరో రెండేళ్లు వృధా కావడంతో ఏకంగా 2025 వరకు ప్రభాస్ బిజీగా ఉండే విధంగా సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నప్పటికీ కూడా ప్రభాస్ రేంజ్ అస్సలు తగ్గలేదు అని చెప్పాలి. ఆయన కోసం బాలీవుడ్ హాలీవుడ్ సంస్థలు కూడా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రాధే శ్యామ్ సినిమా దాదాపు 100 కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్లు సమాచారం.

అందరి ఫోకస్ ఆ సినిమాపైనే..

అందరి ఫోకస్ ఆ సినిమాపైనే..

ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే ఆదిపురుష్ సినిమా పైనే ఉంది. రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓం రావత్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. తప్పకుండా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని కూడా ఈ చిత్ర యూనిట్ సభ్యులు బలమైన నమ్మకంతో ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒకదానికొకటి సంబంధం లేకుండా..

ఒకదానికొకటి సంబంధం లేకుండా..

ఆది పురుష్ సినిమా అనంతరం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్ ఆ తర్వాత ప్రాజెక్ట్ K అలాగే స్పిరిట్ సినిమాలను విడుదల చేయనున్నాడు. ఒకదానికొకటి సంబంధం లేకుండా ప్రభాస్ విభిన్నమైన ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకోవడం విశేషం. ఒక విధంగా చెప్పాలంటే ప్రభాస్ తన కెరీర్లో ఇప్పుడే చాలా వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

యూనివర్సల్ స్టూడియోస్ లో..

యూనివర్సల్ స్టూడియోస్ లో..

ఇక ప్రభాస్ రేంజ్ గురించి తెలుసుకున్న ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ అతనితో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థ మరేదో కాదు. హాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద సూపర్ హీరో ఫిలిమ్స్ నిర్మిఎంసీబీనటువంటి యూనివర్సల్ స్టూడియోస్ ప్రభాస్ తో కూడా ఒక బిగ్ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకే హీరో తో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.

సూపర్ హీరో ఫిల్మ్?

సూపర్ హీరో ఫిల్మ్?

ఆ మధ్య కాలంలో ప్రభాస్ ఒక సూపర్ హీరో ఫిల్మ్ చేయబోతున్నట్లు గా టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే దర్శకుడు నిర్మాణ సంస్థ ఎవరు అనే విషయం మాత్రం బయటకు రాలేదు. ఇక ఇప్పుడు యూనివర్సల్ ప్రొడక్షన్స్ ఆ సినిమానే నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలియడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ అయ్యింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X