Prabhas లిస్టులో బాహుబలి లాంటి కాంబినేషన్.. రంగంలోకి పవన్ కళ్యాణ్ డైరెక్టర్?
ఫ్యాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ గా క్రేజ్ అందుకుంటున్న ప్రభాస్ ప్రస్తుతం ఆసక్తికరమైన ప్రాజెక్టులను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. అన్ని ఒకే తరహాలో ఉండకుండా విభిన్నమైన ప్రాజెక్ట్ లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక భవిష్యత్తులో కూడా ఓకే చేసే ప్రాజెక్టులు అన్నీ కూడా అంతకుమించి అనేలా ఉండాలి అని ప్రభాస్ ఆలోచిస్తున్నాడు. అయితే ప్రభాస్ ఇటీవల మరొక ప్రముఖ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం బాహుబలి నిర్మాతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాబోయే బిగ్ మూవీస్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్లో ఉంచాడు. మొదటగా రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా బ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఆ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వచ్చే ఏడాది మరికొన్ని..: అలాగే ప్రభాస్ లైన్లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ గా ఈ ప్రాజెక్టు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరపైకి తీసుకురాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాదే సంక్రాంతికి విడుదల కావచ్చు అని సమాచారం. అలాగే మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో కూడా స్పిరిట్ అనే ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు.
బాలీవుడ్ దర్శకులతో కూడా..: ఇక ప్రభాస్ ఈ సినిమాలతో పాటు మరికొన్ని బిగ్ ఫ్యాన్ ఇండియా సినిమాలను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. బాలీవుడ్ దర్శకులతో కూడా వర్క్ చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. ఇప్పటికే ఇద్దరు బాలీవుడ్ దర్శకులను లైన్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ విషయంలో మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు.
బాహుబలి నిర్మాతలతో..: ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరొక టాక్ ఏమిటి అంటే బాహుబలి ప్రొడక్షన్ హౌస్ ఆర్కా మీడియా వర్క్స్ లో కూడా ప్రభాస్ మరొక సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. బాహుబలి నిర్మాతలు శోభు, ప్రసాద్ ఇద్దరు కూడా ప్రభాస్ తో చాలాకాలంగా ఒక సినిమా చేయాలి అని చర్చలు జరుపుతున్నారు. అయితే అందుకు తగ్గ దర్శకుడు కూడా కావాలి అని వారు చాలామంది అగ్ర దర్శకుల నుంచి కథలు అయితే వింటున్నారు.

లిస్టులోకి పవన్ దర్శకుడు: అయితే లిస్టులోకి మరొక ప్రముఖ దర్శకుడు చేరినట్లుగా తెలుస్తోంది. అది కూడా పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న క్రిష్ అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. క్రిష్ ఆర్కా మీడియా వర్క్స్ తో చాలా మంచి అనుబంధాలు ఉన్నాయి. గతంలో వీరి కలయికలో వేదం సినిమా కూడా వచ్చింది. వారితో కలిసి క్రిష్ కొన్ని చిన్న సినిమాలు కూడా నిర్మించాడు. అయితే పవన్ కళ్యాణ్ సినిమా తర్వాత క్రిష్ ఆర్కా మీడియాలో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే వీరిద్దరిని కలపాలి అని శోభు యార్లగడ్డ ప్రయత్నం చేస్తున్నారని టాక్. మరి ఈ కాంబో నిజమవుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











