వామ్మో ఇది అరాచకం.. ప్రభాస్ మరో పాన్ ఇండియా.. ఇచ్చిన మాట కోసం తప్పట్లేదు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది నుంచి పాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ అయితే గ్యాప్ లేకుండా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్ లో పెట్టేశాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం మరొక స్టార్ ప్రొడ్యూసర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ప్రభాస్ లైనప్ కూడా..

ప్రభాస్ లైనప్ కూడా..

కాన్సెప్ట్ దొరికితే చాలు దర్శకులు నిర్మాతలు హీరోల డేట్స్ ముందే తీసేసుకుంటున్నారు. మరో మూడేళ్ళ తరువాత అయినా పరవాలేదు అంటూ కమిట్మెంట్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ కూడా అలానే ఉంది. కమర్షియల్ ఫార్మాట్ లోనే వినూత్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

నిధి అగర్వాల్ క్లీవేజ్ షో.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్

ప్రభాస్ చేతిలో బడా సినిమాలు

ప్రభాస్ చేతిలో బడా సినిమాలు

రెబల్ స్టార్ చేతిలో ప్రస్తుతం అగ్ర దర్శకుల ప్రాజెక్టులే ఉన్నాయి. ముందుగా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఆ తరువాత సలార్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రానుంది. ఇక ఆ తరువాత ఆది పురుష్ ను బాహుబలి రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.

కథ వినలేదు.. కానీ

కథ వినలేదు.. కానీ

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా మరొక పాన్ ఇండియా సినిమాను ఇదే ఏడాది స్టార్ట్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మైత్రి మూవీ మేకర్స్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న ప్రభాస్ ఇంకా కథనైతే వినలేదు. దర్శకుడు ఎవరన్నది కూడా ఫైనల్ కాలేదు. నిర్మాతలు మంచి కథలు కోసం సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం.

2023లో దిల్ రాజుతో

2023లో దిల్ రాజుతో

ఇక ఫైనల్ గా ఎన్నో ఏళ్ల క్రితం ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకొని దిల్ రాజుతో సినిమా చేయడానికి ఒకే చెప్పినట్లు టాక్ వస్తోంది. బాహుబలి కంటే ముందే దిల్ రాజు ప్రొడక్షన్ లో ప్రభాస్ ఒక సినిమా చేయాలి. కానీ డార్లింగ్ రేంజ్ పాన్ ఇండియాకు చేరడంతో దిల్ రాజు కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇక మొత్తానికి మరోసారి ఇద్దరి మధ్య చర్చలు జరగడంతో 2023లో ప్రాజెక్ట్ పట్టాలెక్కవచ్చని తెలుస్తోంది.

Recommended Video

Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
మళ్ళీ ఆ దర్శకుడితోనే..

మళ్ళీ ఆ దర్శకుడితోనే..

మరోసారి సలార్ దర్శకుడితోనే ప్రభాస్ సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. KGF రిలీజ్ కాకముందే సలార్ ను మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్ మరోవైపు బన్నీ తారక్ లతో కూడా ప్రాజెక్ట్ ఒకే చేయించుకునే పనిలో పడ్డాడు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ లో ప్రభాస్ తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ అయితే వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X