ప్రభాస్ వెంటపడుతున్న మరో బాలీవుడ్ దర్శకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ గ్యాప్ లేకుండా వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక మరో పాన్ ఇండియా సినిమాను కూడా ఎనౌన్స్ చేసి త్వరలోనే ఆడియెన్స్ కు మళ్ళీ సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు టాక్ వస్తోంది. ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాతో రానున్నట్లు క్లారిటీ ఇవ్వగానే అభిమానులు తెగ సంబరపడిపోయారు.

లాక్ డౌన్ కారణంగా ఎన్నో కథలను విన్న ప్రభాస్ తన రేంజ్ మరింత పెరిగే విదంగా మరింత బలమైన కథలను సెట్ చేసుకుంటున్నాడు. ఇక మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అంటే ముందు చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయక తప్పదు. సాహో అనంతరం సైలెంట్ గా రాధేశ్యామ్ షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు ప్రభాస్. దాదాపు ఆ సినిమా షూటింగ్ ఏండింగ్ కు వచ్చేసింది. లాక్ డౌన్ లేకపోయి ఉంటే సినిమా ఈపాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది కూడా.

 Prabhas another pan india project with bollywood new director

అయితే ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో కూడా ప్రభాస్ ఒక కథపై చర్చలు జరిపినట్లు సమాచారం. కథపై ప్రభాస్ సంతృప్తిగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఊపిరాడనంత బిజీగా ఉన్నాడు. కాబట్టి ముందుగా చేతిలో ఉన్న ఎదో ఒక సినిమా పూర్తి చేయాలి. వీలైతే రాధేశ్యామ్ రిలీజ్ అనంతరం ఎనౌన్స్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్. ఇక దర్శకుడు ఆనంద్ కూడా ప్రస్తుతం బాలీవుడ్ లో మరో సినిమా చేస్తున్నాడు కాబట్టి ప్రభాస్ కు పెద్దగా ఇబ్బంది ఉండదు. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X