మహాభారతంలో ప్రభాస్.. అమీర్‌ఖాన్‌తో కలిసి..!
Recommended Video

బాహుబలి తర్వాత చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రాలకు ఆదరణ పెరుగుతున్నది. దర్శకుడు రాజమౌళి అందించిన స్ఫూర్తితో తమిళ, మలయాళం, హిందీలో హిస్టరీ బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వస్తున్న సినిమా మహాభారతం. మహాభారతం చిత్రాన్ని రూ.1000 కోట్ల బడ్జెట్‌తో మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ రూపొందించాలని నిర్ణయం తీసుకోవడంతో అందరి దృష్టి ఆ సినిమాపై పడింది.

మహాభారతంలో అర్జునుడిగా ప్రభాస్
తాజాగా మహాభారతం సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అమీర్‌ఖాన్ రూపొందించే మహాభారతంలో ప్రభాస్ భాగస్వామ్యం కాబోతున్నారట. ఈ చిత్రంలో ప్రభాస్ అర్జునుడి పాత్రను పోషించనున్నట్టు సమాచారం.

అమీర్, ప్రభాస్ చర్చలు
ఇటీవల ప్రభాస్, అమీర్‌ఖాన్ మధ్య భేటీ జరిగిందట. మహాభారతం సినిమా గురించి, ఆ చిత్రంలోని పాత్ర గురించి యంగ్ రెబల్‌స్టార్‌కు మిస్టర్ ఫర్‌ఫెక్ట్ వివరించాడట. అమీర్ ఖాన్ సూచనకు ప్రభాస్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం లేకపోలేదు.

మహాభారతంలో సల్మాన్, అమితాబ్
మహాభారతం చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించేందుకు అమీర్‌ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్‌తోపాటు పలు భాషల్లోని సూపర్‌స్టార్లకు ఈ చిత్రంలో పాత్రలను ఆఫర్ చేసినట్టు సమాచారం.

మూడు భాగాలుగా మహాభారతం
మహాభారత్‌ను మూడు భాగాల్లో విడుదల చేసేందుకు అమీర్ ఖాన్ కసరత్తు చేస్తున్నారట. మహాభారతం సినిమా తర్వాత అమీర్ నటనకు స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రం 2020 ఓ భాగాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఒక్కో భాగానికి ఒక్కో దర్శకుడు పనిచేస్తాడట. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానకి హాలీవుడ్ రచయితలు పనిచేయనున్నట్టు సమాచారం.

రూ.1000 కోట్ల బడ్జెట్
మహాభారతాన్ని అమీర్‌ఖాన్ అత్యంత భారీ బడ్జెట్‌తోపాటు, ప్రతిష్ఠ్మాత్మకంగా రూపొందించే ఆలోచనలో ఉన్నారు. దాదాపు ఆ చిత్ర బడ్జెట్ రూ.1000 కోట్లు. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ముఖేష్ అంబానీ సహనిర్మాతగా వ్యవహరించనున్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని బాలీవుడ్ పత్రిక ఆ కథనంలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











