హాట్ టాపిక్: 'ఛే గువేరా' గా ప్రభాస్

By Srikanya

హైదరాబాద్: త్వరలో ప్రభాస్... అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, ఛే గువేరా కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. మరి డైరక్టర్ ఎవరూ అంటే ప్రభాస్ పెదనాన్న గారైన కృష్ణంరాజు గారే అని చెప్తున్నారు. ఒకప్పటి యాంగ్రీయంగ్ మెన్ హీరో... కృష్ణంరాజు త్వరలో మెగాఫోన్ చేతపట్టబోతున్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియలాంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇక కృష్ణంరాజు సొంత నిర్మాణ సంస్థ 'గోపీకృష్ణా మూవీస్'లోనే ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం 'ఒక్క అడుగు' అనే టైటిల్‌ని ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేశారు. 'ఛత్రపతి' సినిమాలో ప్రభాస్ 'ఒక్క అడుగు' అంటూ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ బాగా పాపులరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తారాగణం ఎంపికలో కృష్ణంరాజు నిమగ్నమై ఉన్నారు. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలుస్తాయి.

ఆయన ఇదే విషయంపై మాట్లాడుతూ... ఇప్పటివరకూ హీరోగా 150కు పైగా సినిమాలు చేశాను. నిర్మాతగా ఎన్నో విలువైన చిత్రాలు నిర్మించాను. కేంద్రమంత్రిగా పదిహేను నెలలు సేవలందించాను. ఈ మూడు విభాగాల్లోనూ నా పాత్రను సంతృప్తికరంగా పోషించాను. ఇక మిగిలింది దర్శకత్వం. త్వరలో ఆ పని కూడా పూర్తి చేస్తాను అన్నారు డా.కృష్ణంరాజు. ఇకపై కూడా ఇదే రీతిలో తమ సంస్థ ప్రతిష్ఠను ఇనుమడింపజేసే విధంగా మంచి చిత్రాలు నిర్మిస్తాను అన్నారు.

అలాగే ఆదివారాలు కూడా విశ్రాంతి తీసుకోకుండా రాత్రింబవళ్లు పని చేస్తూ ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసేవాణ్ని. కొన్ని నా ఇమేజ్‌ను పెంచుకోవడం కోసం చేస్తే, మరికొన్ని పరిశ్రమ బాగు కోసం చేశాను. మనం ఒక సినిమా చేస్తే కొన్ని వందల కుటుంబాలకు పని దొరుకుతుంది. నేను చేసిన సినిమా టీవీలో చూస్తుంటే చాలా ఆనందం కలుగుతోంది. ఇన్ని గొప్ప సినిమాలు చేశానా... అని మనసు పులకించి పోతోంది. ఇప్పట్లోలాగా కథల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసింది లేదు. సినిమా చేయడానికి నెల రోజుల ముందు కథ వినేవాణ్ని అంతే. ఒకే ఒక్క సినిమా మాత్రం కథ వినకుండా ఆ దర్శకుడి మీద నమ్మకంతో చేశాను. అదే 'కటకటాల రుద్రయ్య'.. అంటూ చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వం చేయబోయే చిత్రం కూడా హిట్టు కావాలని కోరుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X