twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తేలిపోయిన ‘ఏక్ నిరంజన్’ అదే నిజమైతే ‘ప్రభాస్’ కూడా ఇంటికే!

    By Sindhu
    |

    ఏ నటుడికైనా ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చాక ఆ చట్రంలో నుండి అంత త్వరగా బయట పడలేరు. దర్శకులు కొత్త క్యారెక్టర్స్ సషంటిచినా గతంలో హిట్ అయిన పాత్రలతోనే ప్రేక్షకులు ఊహించు కుంటారు. రెబల్ స్టార్ కష్ణంరాజు వారసుడిగా చిత్ర రంగంలో వీర విహారం చేస్తున్న 'ప్రభాస్" నటించిన ఏక్ నిరంజన్ క్యారెక్టర్ చాలా గాలి తరహాలో ఉన్నాయని, గతంలో రవితేజ నటించిన నేనింతే పాత్ర తీరు తెన్నులు ఇంకో రూపంలో ఏక్ నిరంజన్ లో కొనసాగాయని విశ్లేషకుల విమర్శలు. ఒక ఛత్రపతి ఇమేజ్ ఇంకా ప్రభాస్ పై ఉందని అందుకే 'బిల్లా" లాంటి పాత్ర కూడా తేలిపోయింది. ఇప్పుడు ఏ బాదర బందీలేని ఏక్ నిరంజన్ లాంటి పాత్రలు ప్రభాస్ మాస్ ఇమేజ్ ని ఏమాత్రం ప్రభావితం చేయకపోగా ఇంకో మెట్టు కిందకి దిగినట్టు తేలింది.

    ఎన్నో హిట్స్ ఇచ్చిన రాజమౌళి ఇప్పుడు తెలుగు లో నెంబర్ వన్ డైరెక్టర్. ఈ మాట ఒప్పుకోవటానికి ఎవరికీ సందేహం లేదు. హీరో ప్రబాస్ కి ఆయన ఇచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ ని అగ్రహీరోల సరసన నిలబెట్టింది. ప్రస్తుతం ఏక్ నిరంజన్ ప్లాప్ తో డీలా పడిపోయిన ప్రభాస్ ఇతర దర్శకులతో సినిమాలు చేయటానికి వెనుకాడుతున్నారు. రాజమౌళితో చేయాలనుకున్న విశ్వామిత్ర సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే రాజమౌళి 2011 వరకు ఖాలీగా లేడట. అంటే అప్పటి వరకూ ప్రభాస్ కి ప్లాప్ లు తప్పవని భయపడుతున్నాడా? అంత వరకు ఆగితే తరుణ్, ఉదయ్ కిరణ్ లా ప్రభాస్ కూడా తెరమరుగు అయ్యేది మాత్రం ఖాయం అంటున్నారు సినిమా విశ్లేషకులు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X