సుశాంత్ సూసైడ్ ఎఫెక్ట్.. ఆ నిర్మాతతో వర్క్ చేయడానికి భయపడుతున్న ప్రభాస్?

రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్న రెబల్ స్టార్ ప్రస్తుతం రాధేశ్యామ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అనంతరం వైజయంతి ప్రొడక్షన్ లో మరో భారీ బడ్జెట్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. అయితే బాలీవుడ్ నుంచి కూడా ప్రభాస్ కి వరుస అవకాశాలు అందుతున్నాయి. కానీ రెబల్ స్టార్ మాత్రం అంత ఈజీగా ఒప్పుకోవడం లేదు. ఇక సుశాంత్ సూసైడ్ కారణంగా ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ ని చాలా వరకు దూరం పెట్టినట్లు తెలుస్తోంది.

Recommended Video

Sushant Singh Rajput సూసైడ్ కారణంగా Bollywood Offers, Karan Johar ని దూరం పెట్టిన Prabhas
మినిమమ్ 200కోట్లు..

మినిమమ్ 200కోట్లు..

బాహుబలి అనంతరం ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా పెరిగిపోయింది. ఇక ఏ సినిమా చేసినా కూడా అది పాన్ ఇండియా రేంజ్ కో రిలీజ్ కావాల్సిందే. ప్రభాస్ సినిమా బడ్జెట్ మినిమమ్ 200కోట్లు అని నిర్మాతలకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకే ఎక్కువగా బడా నిర్మాతలే ప్రభాస్ ని కలుస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే ఓకే చేస్తున్నాడు.

 ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు

ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు

బాహుబలి 2 సక్సెస్ అయిన తరువాత బాలీవుడ్ నుంచి ప్రభాస్ కి భారీ ఆఫర్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా ధర్మ ప్రొడక్షన్ కరణ్ జోహార్ ప్రభాస్ వద్దకు నాలుగైదు స్టోరీలను తెచ్చాడు. అందులో ఒక కథపై మాత్రమే ప్రభాస్ కొంచెం ఇంట్రెస్ట్ చూపినట్లు అప్పట్లో టాక్ అయితే వచ్చింది. అలాగే యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ నుంచి కూడా ఆఫర్స్ వచ్చయట. కానీ ప్రభాస్ ఇంకా వారికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. వాళ్ళు ప్రభాస్ కోసం కథను డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొన్నాళ్ల పాటు బాలీవుడ్ కి దూరంగా

కొన్నాళ్ల పాటు బాలీవుడ్ కి దూరంగా

ఇక ప్రస్తుతం టాలీవుడ్ పాన్ ఇండియా కథలతో బిజీగా ఉన్న ప్రభాస్ మొన్నటివరకు బాలీవుడ్ నుంచి వచ్చిన స్క్రిప్ట్స్ గురించి బాగానే చర్చలు జరిపాడట. కానీ సుశాంత్ డెత్ అనంతరం బాలీవుడ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో కొన్నాళ్ల పాటు బాలీవుడ్ కి దూరంగా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కరణ్ జోహార్ తో సినిమా?

కరణ్ జోహార్ తో సినిమా?

ముఖ్యంగా కరణ్ జోహార్ బాహుబలి అనంతరం ప్రభాస్ కి మంచి ఫ్రెండ్ అయ్యాడు. అయితే ప్రభాస్ T సిరీస్ తో చేయాల్సిన ఒక ప్రాజెక్ట్ ని కరణ్ జోహార్ తో సెట్ చేసుకున్నట్లు ఒక టాక్ వస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ప్రభాస్ మాత్రం ఇప్పట్లో బాలీవుడ్ సైడ్ వెళ్లకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కరణ్ జోహార్ కి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రభాస్ ప్రయత్నం చేస్తున్నట్లు బాలీవుడ్ లో కూడా రూమర్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X