ప్రభాస్ పుట్టినరోజు కానుక సిద్ధమవుతోందా..? రెబల్ స్టార్ ఇచ్చే సర్‌ప్రైజ్ అదేనా..?
స్టార్ హీరోల పుట్టిన రోజు వేడుకలు వస్తున్నాయంటే చాలు.. తమ అభిమాన హీరో ఇచ్చే సర్‌ప్రైజ్ ఏమై ఉంటుందా అని వారి వారి ఫ్యాన్స్ ఆతృగా చూస్తుంటారు. మరోవైపు సదరు హీరోలు కూడా తమ తమ అభిమానుల కోసం స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసి ఉంచుతారు. ఈ కోవలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన పుట్టిన రోజు కానుకను సిద్ధం చేసి ఉంచారని తెలుస్తోంది.
అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన అభిమానులను సర్‌ప్రైజ్ చేయాలని భావిస్తున్నారట ప్రభాస్. జిల్ ఫేం రాధాకృష్ణతో తానూ చేస్తున్న కొత్త సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయాలనే సన్నాహాల్లో ఉన్నారట ప్రభాస్. ఇటీవలే సాహో రూపంలో ప్రభాస్ ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో, ఆయన తదుపరి సినిమాపై ఓ రేంజ్ ఆశలు పెట్టుకున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.

సో.. తన అభిమానులందరినీ సర్‌ప్రైజ్ చేసేలా తన పుట్టిన రోజు కానుకగా.. కొత్త సినిమా టైటిల్ ప్రకటిస్తారట ప్రభాస్. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు 'జాన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి చివరకు ప్రభాస్ ఇదే టైటిల్ చెబుతాడా? లేక రియల్ సర్‌ప్రైజ్ ఇస్తాడా? అనేది.
ప్రభాస్ తన పుట్టినరోజు వేడుకలను లండన్‌లో జరుపుకోనున్నారని సమాచారం. ఆ వెంటనే హైదరాబాద్ చేరుకొని ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని టాక్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. భారీ హంగులతో త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసి.. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్.


Click it and Unblock the Notifications











