హృతిక్ సినిమా రీమేక్‌లో ప్రభాస్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో ఓ హిందీ రీమేక్ ద్వారా ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాడనే ప్రచారం ఫిల్మ్ నగర్లో జోరందుకుంది. ఇటీవల విడుదలైన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సూపర్ హిట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ 'అగ్నిపథ్' సినిమాను తెలుగులో రీమేక్ చేయించుకునే ప్రయత్నంలో ప్రభాస్ ఉన్నాడని, చత్రపతి రేంజ్ లో ఈ సినిమా ఉందని, ఆ సినిమాలోని మాస్ ఎలిమెంట్స్‌కు పర్సనాలిటీ పరంగా తాను బాగా సెట్టవుతానని ప్రభాస్ భావిస్తున్నారని తెలుస్తోంది. పలువరు టాలీవుడ్ నిర్మాతలు కూడా ప్రభాస్ అయితేనే ఈ సినిమాకు కరెక్టనే యోచనలో ఉన్నారని, త్వరలోనే ఈ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ నుంచి రీమేక్ హక్కులను సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ లారెన్స్ దర్శకత్వంలో 'రెబల్' చిత్రంలో నటిస్తున్నాడు. రెబల్ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె పుల్లారావు, జె భగవాన్ నిర్మిస్తున్నారు. దర్శకుడు రాఘవ లారెన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో వారధి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానన్ని ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశి కృష్ణ శ్రీనివాస్ సంయుక్తం గా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ చిత్రం ద్వారా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయి.


Click it and Unblock the Notifications











