"ఓజి" ప్రభాస్ క్యామియో .. బాక్సాఫీస్ బ్లాస్టింగ్ కాంబినేషన్‌పై తేల్చేసిన మేకర్స్..
ఇపుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు క్రేజీ కాంబినేషన్‌లు బాక్సాఫీస్‌ని ఏ రకంగా షేక్ చేస్తున్నాయో తెలిసిందే. ఒక పక్క ఎంటర్టైన్మెంట్ తో పాటుగా మరో పక్క ఈ కాంబినేషన్ ల మూలాన సినిమాలకి భారీ బిజినెస్‌లు కూడా జరుగుతున్నాయి. ఇలా ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర దర్శకుడు లేదా హీరోల కాంబినేషన్ కాకుండా , ఊహించని మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది.
ఇలా ఇటీవల వచ్చిన పలు భారీ మల్టీస్టారర్ చిత్రాలు బాక్సాఫీస్‌లని షేక్ చేయగా పాన్ ఇండియా మార్కెట్‌లో కూడా ఈ ట్రెండ్ బాగానే హిట్ అయ్యింది. అయితే ఈ ట్రెండ్‌ని మన తెలుగు సినిమానే హైలైట్ చేయగా లేటెస్ట్ గా ఓ షాకింగ్ అండ్ షేక్ చేసే రూమర్ అయితే వైరల్ గా మారింది. టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలలో దర్శకుడు సుజీత్‌తో చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఓజి .

కాగా ఈ సినిమా కోసం అభిమానులు ఎప్నటి నుంచో ఎదురు చూస్తున్నారు. పవన్ ఈ సినిమాని ఎంత వేగంగా మొదలు పెట్టారో అదే రీతిలో భారీగా గ్యాప్‌ని కూడా ఇచ్చేసి చాలా ఆలస్యం చేస్తూ వచ్చారు. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27నే విడుదల కావాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం, ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాద్యతలు చేపట్టడం తదితర కారణాల చేత ఆగిపోవాల్సి వచ్చింది.
కేవలం పవన్, సుజీత్ బ్రాండ్‌తోనే సెన్సేషనల్ హైప్‌ని ఈ సినిమా సెట్ చేసుకుంటే దీనికి పాన్ ఇండియా హీరో ప్రభాస్ లాంటి స్టార్ తోడైతే ఆ ఊహే ఊహించని లెవెల్లో ఉంటుంది. అయితే ఆ మధ్య సినిమా సెట్టింగ్స్ నుంచే పలు లీక్స్ వస్తున్నాయి. ప్రభాస్ - సుజీత్‌తో చేసిన సాహో సినిమాలో వాడిన సీన్ల ప్రస్తావన ఓజిలో కనిపించింది.

దీనితో రెండు సినిమాలు క్రాసోవర్ అంటూ క్రేజీ ఊహాగానాలే వచ్చాయి. కానీ లేటెస్ట్ గా ఏకంగా ప్రభాస్ ఓజి క్లైమాక్స్ లో కనిపిస్తాడంటూ కొన్ని గాసిప్స్ గుప్పుమన్నాయి. దీనితో ఈ ఇద్దరి కాంబినేషన్ ఫిక్స్ అయ్యిపోయింది అని చాలా మంది అందుకున్నారు. దీనిపై డైరెక్ట్ గా ఓజి నిర్మాణ సంస్థ నుంచి ఒక ఇన్ డైరెక్ట్‌గా క్లారిటీ వచ్చేసింది.
కాగా సర్క్యులేట్ అవుతున్న రూమర్స్ కి కౌంటర్ గా అన్నట్టు వెంకీ సినిమా నుంచి బ్రహ్మానందం టెంప్లెట్ తో అవన్నీ నమ్మావు అంటే నువ్వూ కన్నాలేసుకొని బతకలిరా అంటూ.. ఆ గాసిప్స్ పైనే క్లారిటీ ఇచ్చేసారు. దీనితో ప్రస్తుతానికి వైరల్ అవుతున్న ఈ క్రేజీ టాక్‌లో ఎలాంటి నిజం లేదని కన్ఫర్మ్ అయ్యిపోయింది. కాగా ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











