పుష్ప నిర్మాతలకు హ్యాండ్ ఇచ్చిన ప్రభాస్.. అన్ని కోట్లా రెమ్యునరేషన్ ఇచ్చినా ప్రాజెక్ట్ క్యాన్సిల్?
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. బడా నిర్మాతలు అందరూ కూడా ప్రభాస్ ని సినిమాలు చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్ కూడా యంగ్ రెబల్ స్టార్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పందం చేసుకుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడానికి రెడీ అయ్యి దర్శకుడిని కూడా రంగంలోకి దించారు.
పఠాన్ ఫేమ్ సిద్దార్ద్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. డార్లింగ్ ప్రభాస్ కి ఏకంగా 75 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అలాగే దర్శకుడు సిద్దార్ద్ ఆనంద్ కి కూడా భారీగా అడ్వాన్స్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఈ సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యేలా ఉందనే మాట వినిపిస్తోంది.

సిద్దార్ద్ ఆనంద్ పఠాన్ సక్సెస్ తర్వాత ప్రస్తుతం ఫైటర్ అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ కావడానికి ఈ ఏడాది ఆఖరు అవుతుంది. దీని తర్వాత షారుఖ్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రం అయిన పఠాన్ వెర్సస్ టైగర్ మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆ మూవీ కథ పూర్తి కావడానికి చాలా టైమ్ పడుతుందంట.
ఈ నేపధ్యంలో వార్ 2 మూవీ అవకాశాన్ని కూడా సిద్దార్ద్ ఆనంద్ వదిలేసుకున్నారు. వార్ మూవీ సిద్దార్ద్ ఆనంద్ దర్శకత్వంలోనే తెరకెక్కగా ఇప్పుడు దానికి సీక్వెల్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇలా వరుసగా హిందీలో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టుకొని ఉన్నారు. ఈ నేపధ్యంలో ప్రభాస్ కోసం మైత్రీ నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసారంట. టైమ్ చూసుకొని ఇంకా ఎప్పుడైనా ప్రాజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తానని సిద్దార్ద్ ఆనంద్ మైత్రీ నిర్మాతలకి మాట ఇచ్చి ప్రభాస్ మూవీ కోసం కథ ఇప్పట్లో సిద్ధం చేయడం కష్టం అని తేల్చేసాడంట. దీంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లే అనే మాట వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications










