Prabhas పెళ్లి వాయిదా వెనుక ప్రభాస్ పక్కా ప్లాన్.. మరో ఐదేళ్ల వరకు నోరెత్తకుండా యంగ్ రెబల్ స్టార్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత మెల్లగా పాన్ ఇండియా స్టార్ గా తన స్థాయిని మరొక లెవెల్ కు పెంచుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా హైలెట్ అయ్యేలా అడుగులు వేస్తున్నాడు. భవిష్యత్తులో ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనే విషయం కూడా ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఇక పెళ్లి అంటే కిలోమీటర్లు పరిగెత్తే ప్రభాస్ మరో ఐదేళ్ల వరకు ఇంట్లో వాళ్ళు ఆ విషయంలో ఇబ్బంది పెట్టకుండా మంచి ప్లాన్ వేసినట్లు అర్థమవుతోంది.

స్పెషల్ బర్త్ డే విషెస్

స్పెషల్ బర్త్ డే విషెస్


పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు అందుకున్న ప్రభాస్ రానున్న రోజుల్లో తప్పకుండా గ్లోబల్ స్టార్ గా కూడా తన ఖ్యాతిని మరింత పెంచుకుంటాడు అని అర్థమవుతుంది. మంచి మనసున్న ప్రభాస్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. అందుకే అతను ఎంత స్థాయికి ఎదిగిన కూడా ఎవరూ కూడా నెగటివ్ కామెంట్స్ చేయరు. దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ప్రభాస్ ను ఎంతగానో ఇష్టపడతారు. 42వ పుట్టినరోజు సందర్భంగా అందరు హీరోల అభిమానులు కూడా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఎన్నోసార్లు చెప్పిన కృష్ణంరాజు

ఎన్నోసార్లు చెప్పిన కృష్ణంరాజు

ఇక ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనే విషయం కూడా గత కొంతకాలంగా అందరినీ ఎంతగానో ఆలోచింపజేస్తోంది. ఇదివరకే కొన్ని ఇంటర్వ్యూలలో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజును చాలామంది ప్రశ్నించారు. కానీ ఆయన మాత్రం ఆ విషయంలో చేయి దాటిపోయింది అనే విధంగా సమాధానం ఇచ్చారు. ఫైనల్ గా అది ప్రభాస్ నిర్ణయమే అని, అతను ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాడు అని అన్నారు. అంతేకాకుండా మేము చాలా సార్లు అడిగి చూసినప్పటికి కూడా ప్రభాస్ ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని కూడా అన్నారు.

వాయిదా వేసుకుంటూ వచ్చిన ప్రభాస్

వాయిదా వేసుకుంటూ వచ్చిన ప్రభాస్


మొత్తానికి ఇంట్లో వాళ్ళు కూడా ప్రభాస్ కు చెప్పి చెప్పి అలసిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఎవరో ఒకరు ప్రభాస్ ను పెళ్లి చేసుకొమ్మని కాస్త బతిమాలుతూ ఉన్నారట. ఇక ఆ విషయంలో ముందుగానే రెబల్ స్టార్ ఒక ప్లాన్ వేసుకున్నాడు. మొదట బాహుబలి సినిమా పూర్తి చేసిన తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఆ తర్వాత కరోనా రావడంతో ఈ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అంత శ్రేయస్కరం కాదని వివరణ ఇచ్చాడట. ఇక ఆ తర్వాత చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పాడని టాక్ వచ్చింది.

చేతిలో ఉన్న సినిమాలు పూర్తవ్వాలి అంటే..

చేతిలో ఉన్న సినిమాలు పూర్తవ్వాలి అంటే..

కానీ ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి అవ్వాలి అంటే మరొక 5 ఏళ్ల సమయం పడుతుంది. రాధేశ్యామ్ సినిమా దాదాపు విడుదలకు సిద్ధమైంది. ఇక ఆ తర్వాత సలార్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత ఆదిపురుష్ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్ట్ Kకు మరొక రెండు మూడేళ్ల సమయం తీసుకుంటుంది. ఆ సినిమా కోసం దాదాపు ఐదు వందల కోట్ల పైగా ఖర్చు చేయబోతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ లోనే కాకుండా ఇటీవల సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా స్పిరిట్ అనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 కాలమే సమాధానం చెప్పాలి

కాలమే సమాధానం చెప్పాలి


ఈ సినిమాలన్ని పూర్తయ్యేసరికి ఐదేళ్ల సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు అయితే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలుస్తోంది. సినిమాలతో బిజీగా ఉండడం వలన ఇంట్లో వాళ్ళు కూడా ప్రభాస్ ను పెద్దగా టచ్ చేయడం లేదట. ఇక హ్యాపీగా స్నేహితులతో సరదాగా సినిమాలు చేసుకుంటూ ఉండాలని సోలో లైఫ్ ను ఇష్టపడుతున్న ప్రభాస్ ఇంట్లో వాళ్ళను మాత్రం సినిమాల పేరుతో బోల్తా కొట్టించాడు అని తెలుస్తోంది. ఏదేమైనా డార్లింగ్ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఆయన ఎప్పుడు ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాడో కాలమే సమాధానం చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X