twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌కు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్.. త్వరలో గవర్నర్‌గా కృష్ణంరాజు!

    |

    బాహుబలి తర్వాత ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజీ హీరోగా మారిపోయాడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ చిత్రాల మార్కెట్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 200 కోట్ల బడ్జెట్ లో సాహో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హీరోగా ప్రభాస్ కెరీర్ ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉంది. ఈ దశలో ప్రభాస్ గురించి ఓ ఆంగ్ల పత్రిక సంచలన కథనం ప్రచురించింది. మరికొద్ది నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలో ప్రభాస్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడనేది ఈ వార్త సారాంశం.

    బాహుబలి తర్వాత జోరు

    బాహుబలి తర్వాత జోరు

    బాహుబలి చిత్రం కోసం దాదాపుగా ఐదేళ్లు కేటాయించిన ప్రభాస్ ప్రస్తుతం జోరు పెంచాడు. ఇకపై వేగంగా చిత్రాలు చేయాలనీ నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ప్రభాస్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తుండడం విశేషం. సాహో చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. మరోవైపు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. కెరీర్ ఇలా పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ప్రభాస్ కు రాజకీయాల్లో ప్రవేశించే ఆఫర్ వచ్చినట్లు ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది.

    నీ కంటే కూల్ ఎవరు దాదా.. ప్రభాస్ ఫోటో వైరల్, సాహో సెట్లోని ఫోటో లీక్ చేసిన హీరో! (ఫొటోలు)నీ కంటే కూల్ ఎవరు దాదా.. ప్రభాస్ ఫోటో వైరల్, సాహో సెట్లోని ఫోటో లీక్ చేసిన హీరో! (ఫొటోలు)

     బిజెపి తరుపున

    బిజెపి తరుపున

    బిజెపి అధిష్టానం ఆయా రాష్ట్రాల్లో బలపడేందుకు రచించిన పథకంలో భాగంగా ప్రభాస్ ని రాజకీయాల్లోకి ఆహ్వానించబోతోందట. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాస్ ని ఎమ్మెల్యేగా పోటీకి దింపేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రధానిగా ఆయన టర్మ్ పూర్తి కానుంది. రెండవసారి బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారట.

    గవర్నర్‌గా కృష్ణంరాజు

    గవర్నర్‌గా కృష్ణంరాజు

    ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు బిజెపి అధిష్టానం గవర్నర్ పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభాస్, కృష్ణంరాజు ఇద్దరినీ ఢిల్లీకి పిలిపించుకుని బిజెపి పెద్దలు చర్చలు జరపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కృష్ణంరాజు గవర్నర్ కాబోతున్నట్లు గతంలో కూడా ఓ సారి వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఆ స్థానంలో కృష్ణంరాజుని నియమించనున్నారనే ప్రచారం జరుగుతోంది.

    ఢిల్లీ స్థాయిలో

    ఢిల్లీ స్థాయిలో

    ప్రభాస్, కృష్ణంరాజు గురించి బిజెపి జాతీయ అధ్యక్షుడు ఇటీవల ఢిల్లీలో ఏపీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఎమ్మెల్యేగా పోటీ చేసే విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అమిత్ షా నేతలకు ఆదేశించారట. కృష్ణంరాజు బిజెపితో సన్నిహితంగానే ఉంటున్నారు. ఏ భాద్యత అప్పగించినా ఆయన అంగీకరించే అవాకాశం ఉంది. కానీ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ బిజెపి ఆఫర్ అని అంగీకరిస్తాడా లేదా అనేది తేలాల్సి ఉంది.

    English summary
    Prabhas to contest MLA election on BJP ticket; Krishnam Raju to be AP's new Governor
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X