నిత్యా మీనన్‌కి ప్రబాస్ అంత ఘాటుగా కౌంటరిచ్చాడా?
ప్రభాస్ తో సినిమా ఆఫర్ వస్తే ఏక్సెప్ట్ చేస్తారా అని అడిగితే వెంటనే తడుముకోకుండా...- 'ఆయనెవరు?' అని నిత్యా మీనన్ అడిగిన విషయం మీడియాలో హైలెట్ అయిన సంగతి తెలిసిందే. ప్రబాస్ పనులున్నవాళ్లు ,అభిమానులు ఈ విషయమై ఇప్పటికే మండిపడిపోయారు.అయితే తాజాగా ప్రభాస్ కూడా ఈ విషయమై స్పందించాడని సమాచారం. ప్రబాస్ ఆమెకు తను నటించిన సినిమాలు పార్సిల్స్ పంపించాడట.అంతేగాక ఫోన్ చేసి నన్ను ప్రభాస్ అంటారు.
నేను ఓ తెలుగు హీరోని, నేను ఛత్రపతి,డార్లింగ్, మిస్టర్ ఫెరఫెక్ట్ అనే చిత్రాల్లో నటించాను అని చెప్పారట.ఇవన్ని మీడియాలో ప్రభాస్ కౌంటరిచ్చాడంటూ వస్తున్న వార్తలు.అయితే కొందరు ప్రభాస్ మాత్రం ఈ విషయాన్ని లైట్ గా తీసుకున్నాడని, పట్టించుకుని అనవసరంగా అల్లరి అయ్యి నిత్యామీనన్ కి పబ్లిసిటి ఇవ్వటం ఎందుకని ఆగిపోయాడని అంటున్నారు.ఏది నిజమో ..ఏది అబద్దమో...నిత్యామీనన్ కీ,ప్రభాస్ కీ తెలియాలి..ఎందుకంటే అదివారి పర్శనల్ మ్యాటర్ కాబట్టి.


Click it and Unblock the Notifications











