ఇంట్రెస్టింగ్: గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో ప్రభాస్.. ఆ 20 నిమిషాలు మామూలుగా ఉండదు.!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న హీరో. రెబెల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుంచి సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయిన ఈ హ్యాండ్సమ్ గాయ్.. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్‌తో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. ఈ క్రమంలోనే అతడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం.!

ఇక్కడ బాలేదన్నారు.. అక్కడ మాత్రం అదిరింది
యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో'. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా గత ఏడాది విడుదలైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు అంతలా ఆదరించలేదు. అయితే, బాలీవుడ్‌లో మాత్రం ఈ మూవీ సత్తా చాటింది. అంతేకాదు, అక్కడ కలెక్షన్ల పరంగానూ ‘సాహో' దుమ్ము దులిపేసింది.

మళ్లీ అదే రేంజ్.. ఈ సారి సరికొత్తగా ప్రభాస్
ప్రస్తుతం ప్రభాస్.. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పూర్తి లవ్ రొమాంటిక్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. గోపికృష్ణ బ్యానర్‌తో పాటు యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి ప్రేమకథతో రాబోతున్న ఈ మూవీ కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ముందు అనుకున్నది సమంత వల్ల మారిపోయింది
ప్యూర్ లవ్ స్టోరీతో రూపొందుతున్న ఈ సినిమాకు మొదట ‘జాన్' అనే టైటిల్ అనుకున్నారు. అయితే, ఈ మధ్య ‘జాను' అనే పేరుతో సమంత సినిమా రావడంతో దాన్ని మార్చుతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం యూవీ క్రియేషన్స్ సంస్థ ఫిల్మ్ చాంబర్‌తో ‘ఓ డియర్', ‘రాధేశ్యామ్' అనే టైటిళ్లు రిజిస్టర్ చేయించింది. ఈ రెండింటిలో ఒకటి ఫిక్స్ చేస్తారని సమాచారం.

పునర్జన్మలు.. తండ్రి కొడుకులు.. దొంగతనాలు
ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా పునర్జన్మల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోందని కొందరు అంటుంటే.. ఇందులో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడని, అది కూడా తండ్రి కొడుకుగా కనిపిస్తాడని మరికొందరు చెబుతున్నారు. అలాగే, ఇందులో యంగ్ రెబెల్ స్టార్ దొంగతనాలు చేస్తాడన్న ప్రచారమూ సాగుతోంది.
Recommended Video


గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో రెబెల్ స్టార్
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రోల్ గురించి తాజాగా ఓ వార్త లీక్ అయింది. దీని ప్రకారం... ఇందులో యంగ్ రెబెల్ స్టార్ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడట. ఇప్పటి వరకు అతడిని చూడని విధంగా ఉంటుందట ఆ గెటప్. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఈ పాత్ర 20 నిమిషాలు ఉంటుందని, ఆ ఎపిసోడ్ అంతా అదిరిపోతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











