రొమాన్స్ తో పిచ్చెక్కించబోతున్న ప్రభాస్.. చాలా కాలం తరువాత ఆ స్టైల్లో..
కామెడీ, యాక్షన్, రొమాంటిక్ ఇలా ఎలాంటి క్యారెక్టర్లలోనైనా అద్భుతంగా నటించి అందరి చేత ఆహా అనిపించే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్టైల్, క్యారెక్టరైజేషన్ కు విపరీతైమన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రభాస్ అండ్ మారుతి హిట్ ఫార్ములా కామెడీయే. ఎక్కువ సినిమాల్లో ప్రభాస్ కామెడీ, రొమాంటిక్ గా కనిపిస్తుంటారు.
అయితే ఈ మధ్య చాలా సినిమాల్లో ప్రభాస్ అంతగా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించలేదు. వర్షం, పౌర్ణమి, చక్రం వంటి సినిమాల్లో ఫుల్లుగా రొమాన్స్ చేసిన డార్లింగ్.. ఈ మధ్య అలాంటి చిత్రాల్లో కనిపించనే లేదు. కానీ తాజాగా ఆయన చేయబోతున్న ఓ సినిమాలో ఫుల్ రొమాంటిక్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రాబుతున్న విషయం అందరికీ తెలిసిందే.

హారర్ జోనర్ లో నడిచే ఈ సినిమాలో కూడా కామెడీ, రొమాన్స్ భారీగానే ప్లాన్ చేశారట. ముఖ్యంగా ప్రభాస్ ఫుల్ రొమాంటిక్ యాంగిల్ లో కనిపించబోతున్నారట. ఈ చిత్రంలో మాళవికా మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆమెతో రొమాన్స్ చేయనున్నాడట. భారీగానే కిస్సింగ్ సీన్స్, హగ్గింగ్ సీన్స్ పెడుతున్నారట. మాళవికతో ప్రభాస్ లవ్ ్రాక్ ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ కాబోతుందట.

అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ సెట్ లో ప్రభాస్, మాళవిక లవ్ ట్రాక్ ను తెరకెక్కించారట. వీరిద్దరి మధ్య తెరకెక్కించిన సీన్లు చాలా బాగా వచ్చాయని, ఈ ట్రాక్ హిలేరియస్ గా ఉండబోతుందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రభాస్ తాతయ్యగా కనిపించబోతున్నారు. జూన్ నుంచి సంజూ భాయ్ సెట్ లోకి అడుగు పెట్టబోతున్నారు. సంజూ పార్ట్ పూర్తయితే సినిమా సగం పూర్తయినట్లేనని సమాచారం. మరోవైరు ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మధ్య ఎక్కువగా మాస్ యాంగిల్స్ చూపిస్తున్న ప్రభాస్ మరోసారి రొమాంటిక్ గా కనిపించనున్నారంటే ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నామంటూ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











