ప్రభాస్ నో కాంప్రమైజ్ పాలసీ.. కనీసం రూ. 200 కోట్లు ఉండాలట!

Recommended Video

Prabhas Not Compromising In Terms Of Quality And Visual Effects || Filmibeat Telugu

బాహుబలి, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రేంజి ఒక్కసారిగా మారిపోయింది. ఈ చిత్రం ప్యాన్ ఇండియా వైడ్ సంచలన విజయం అందుకోవడంతో యంగ్ రెబల్ స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్ ఓ విషయం గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇకపై చేసే సినిమాల విషయంలో క్వాలిటీ అంశంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని నిర్ణయించుకున్నారు.

ప్రభాస్‌ను బాహుబలి లాంటి భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలో చూసిన ఫ్యాన్స్... ఇక ముందు వచ్చే చిత్రాల్లో అంతకు మించి ఆశిస్తారు. అందుకే సాహో చిత్రాన్ని రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చేశారు.

క్వాలిటీ కావాలంటే భారీ బడ్జెట్ కావాల్సిందే

క్వాలిటీ కావాలంటే భారీ బడ్జెట్ కావాల్సిందే

విజువల్స్ విషయంలో హాలీవుడ్ స్టాండర్డ్స్ కావాలంటే బడ్జెట్ కూడా భారీ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రభాస్ కూడా ఈ విషయంలో గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తన సినిమా ఉండాలనేదే యంగ్ రెబల్ స్టార్ తపన.

‘సాహో' ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టమే

‘సాహో' ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టమే

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘సాహో' ఇండియన్ సినిమా చరితక్రలో ఇప్పటి వరకు రాని ఒక భారీ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒళ్లు గగుర్బొడిచేలా ఫైట్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి. ఈ సినిమాకు పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పని చేస్తున్నారు. సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అనేది ఎవరి ఊహకు అందడం లేదు.

సాహో తర్వాత మూవీ కూడా భారీ బడ్జెట్‌తో

సాహో తర్వాత మూవీ కూడా భారీ బడ్జెట్‌తో

‘సాహో' తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పీరియడ్ రొమాంటిక్ డ్రామా చేస్తున్నారు. ఈ చిత్రం కూడా బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం రూ. 225 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ప్రభాస్ రేంజికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది.

ప్రభాస్ మార్కెట్ కూడా అదే స్థాయిలో...

ప్రభాస్ మార్కెట్ కూడా అదే స్థాయిలో...

బాహుబలి, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ మార్కెట్ స్థాయి కూడా బాగా పెరిగిపోయింది. తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ ప్రభాస్ సినిమాలంటే అంటే క్రేజ్ ఏర్పడింది. వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. మరి అలాంటి పరిస్థితి ఉన్నపుడు ప్రభాస్ కూడా నో కాంప్రమైజ్ పాలసీ పాటించడం, ఖర్చు ఎక్కువైనా క్వాలిటీ సినిమాలు అందించాలని కోరుకోవడం సహజమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X