2 ఎకరాల్లో ప్రభాస్ రాజమహల్.. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా .. భవనం ఎక్కడో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లెజెండరీ నటుడు కృష్ణం రాజు వారసత్వాన్ని అందిపుచ్చుకుని టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రభాస్, బాహుబలి సిరీస్, సలార్, కల్కి 2898 AD వంటి సినిమాలతో భారీ విజయం అందుకుని ఇండస్ట్రీలో పలు రికార్డులను క్రియేట్ చేశారు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ వర్డల్ వైల్డ్ గా కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. తాజాగా ప్రభాస్ పర్సనల్ విషయం ఒక్కటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

సినిమాల్లోనే కాదు, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ప్రభాస్ దూసుకుపోతున్నారనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆయన భారీ డ్రీమ్ మ్యాన్షన్ (రాజ భవనం) నిర్మాణం శ్రీకారం చుట్టారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త కొత్తది కాదు, కానీ తాజాగా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్న సమాచారంతో సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశమైంది.

Prabhas Dream Mansion in Hyderabad 160 Cr Luxury Palace Rising in Financial District

ఇప్పటికే ప్రభాస్‌కు రాయదుర్గం ప్రాంతంలో ఓ లగ్జరీ గెస్ట్ హౌస్ ఉంది. అది టాలీవుడ్ సెలబ్రిటీలకు పార్టీ స్పాట్‌గా కూడా ప్రసిద్ధి చెందింది. అయితే, ఇటీవల ఆ ప్రాంతం చాలా అరుదుగా మారిపోవడంతో, మరింత ప్రైవసీ, లగ్జరీ కోసం మరో కొత్త గెస్ట్ హౌస్ ను నిర్మించాలని భావించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

సమాచారం ప్రకారం.. ఒక్క ఏకరం ధర సుమారు రూ.80 కోట్లు ఉండగా, రెండు ఎకరాలకు దాదాపు రూ.160 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రభాస్ రెండు సంవత్సరాల క్రితమే కొనుగోలు చేసారు, అన్ని అనుమతులు పూర్తి అయిన తర్వాత ఇటీవల నిర్మాణ పనులు ప్రారంభించారని సమాచారం. ముఖ్యంగా కోకాపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్‌కు సమీపంలో ఈ స్థలం ఉందట. ఇతర ముఖ్య ప్రాంతాలకు ఈజీ కనెక్టివిటీ లభిస్తుంది. కోకాపేట్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, అలాగే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రదేశాలకు సులభంగా చేరుకోవచ్చు.

ఈ మ్యాన్షన్ గురించి వినిపిస్తున్న వివరాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఇంటిలో అత్యాధునిక సౌకర్యాలు ఉండనున్నాయని సమాచారం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో డిజైన్ చేయబడిన ఇంటీరియర్స్, భారీ హోమ్ థియేటర్, అత్యాధునిక జిమ్, స్విమ్మింగ్ పూల్, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్-ఆల్-ఇన్-వన్ లగ్జరీ హౌస్‌గా రూపొందించనున్నారట. మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి కనీసం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందట.

ఇక ప్రభాస్ గత కొన్నేళ్లుగా హైదరాబాద్ చుట్టుపక్కల వ్యవసాయ భూముల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్‌లో దీర్ఘకాలిక లాభాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ పెట్టుబడులు లేదా ట్రేడ్‌లను కోరుతున్నారు. సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూ, భవిష్యత్తును మరింత సురక్షితంగా చేసుకుంటున్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ మొత్తం సమాచారం అధికారికంగా ధృవీకరించబడలేదు. కానీ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ప్రభాస్ డ్రీమ్ మ్యాన్షన్ నిర్మాణం నిజమేనని చెప్పారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే, అది హైదరాబాద్‌లో మరో ఐకానిక్ సెలబ్రిటీ హౌస్‌గా నిలిచే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X