Prabhas: ఆ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న ప్రభాస్... ఆ స్థానంలోకి అల్లు అర్జున్ ఎంట్రీ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. బహుబలి సీరిస్ తర్వాత ఆయన క్రేజ్ మారిపోయింది. ఇక ఆయన తీసిన సాహో, రాధేశ్యాం,ఆదిపురుష్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ప్రస్తుతం ఈ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ క్రేజీ ప్రాజెక్టుల్లో నుంచి ప్రభాస్ తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ఆ ప్రాజెక్టులోకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చాడని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....
ప్రభాస్... ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి, ఇక మారుతి డైరెక్షన్ లో రాజా డిలాక్స్ సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ప్రశాంత్ నీల్ దరకత్వంలో తెరకెక్కుతున్న సలార్ ఈ డిసెంబర్ 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ సినిమా రాబోతుంది. ఇక సలార్ సినిమా పక్కా హిట్ అంటూ ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు.

సలార్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి సినిమా రిలీజ్ కానుంది. ఇక మారుతి సినిమా, ఆ తర్వాత సందీప్ వంగాతో స్పిరిట్ అనే సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇటీవల మంచు విష్ణు పాన్ ఇండియా ప్రాజెక్టు కన్నప్ప సినిమాలో కూడా ప్రభాస్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అంతే కాదు ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు నయనతార నటిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.
ప్రభాస్.. మంచు విష్ణు ప్రాజెక్టులో శివుడు క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన సరసన నయనతార పార్వతి దేవి పాత్రలో కనిపించనుంది అంటూ ప్రచారం అయితే జరిగింది. అంతేకాదు దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేయబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరో న్యూస్ బయటకు వచ్చింది.
పాన్ ఇండియా ప్రాజెక్టు మంచు విష్ణు కన్నప్ప నుంచి ప్రభాస్ తప్పుకున్నాడని నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు ఈ స్థానంలోకి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారని ప్రచారం జరుగుతుంది. దీంతో ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తే చూద్దామని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఎంటర్ అవ్వడం ఏంటని అంటున్నారు.

ఇక మంచు విష్ణు కన్నప్ప విషయానికి వస్తే... తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. ప్రస్తుతం స్విట్జర్ ల్యాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల ఈ సినిమా నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకున్నట్లు మంచు విష్ణు ప్రకటించాడు. అంతే కాదు.. ఈ సినిమాలో కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ కూడా నటించనున్నాడు. ఇక ఈ సినిమాను మంచు మోహన్ బాబు తన సొంత బ్యానర్ పై వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చూడాలి మరి ఏమేరకు హిట్ అవ్వనుందో.


Click it and Unblock the Notifications











