Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. బాహుబలి తరహాలో ట్విస్ట్..

Prabhas Dual Role in Fauji: టాలీవుడ్‌ను దాటి పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో ప్రభాస్ (Prabhas). ఒక్కో సినిమాతో తన నటనా ప్రతిభను నిరూపించుకుంటూ, చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిన ఆయన... 'బాహుబలి' తర్వాత పూర్తిగా కొత్త లీగ్‌లోకి వెళ్లిపోయారు. దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్‌బేస్ సంపాదించుకున్న ప్రభాస్, ఇప్పుడు ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకరిగా మారిపోయారు. భారీ బడ్జెట్ చిత్రాలు, ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్‌లు, గ్లోబల్ మార్కెట్ టార్గెట్ చేసిన ప్రాజెక్టులతో ఆయన కెరీర్ దూసుకుపోతోంది. ఇలా సూపర్ స్టార్ ప్రభాస్ మరోసారి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

'సీతారామం'తో క్లాసికల్ రొమాన్స్‌కు కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా ఫౌజీ (Fauji). ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ సినిమాపై వస్తున్న కీలక అప్‌డేట్స్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపుతున్నాయి.లేటెస్ట్ సమాచారం ప్రకారం.. బాహుబలి తరహాలో 'ఫౌజీ'లో ప్రభాస్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారట. ఇప్పటికే భారీ యాక్షన్ సినిమాలతో తన స్టామినాను నిరూపించుకున్న ప్రభాస్, ఈసారి మాత్రం పూర్తిగా భిన్నమైన అవతార్‌లో దర్శనమివ్వబోతున్నారని టాక్.

Prabhas Dual Role in Fauji

ఒకవైపు పవర్‌ఫుల్ సైనికుడిగా, మరోవైపు భావోద్వేగాలతో నిండిన పాత్రలో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ డ్యూయల్ షేడ్స్‌నే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు సమాచారం. 'ఫౌజీ' కథ 1940ల బ్రిటిష్ ఇండియా నేపథ్యంతో రూపొందుతున్న పీరియడ్ వార్ డ్రామా.

దేశభక్తి అంశాలతో పాటు బలమైన ప్రేమకథ కూడా ఇందులో భాగంగా ఉండనుందని తెలుస్తోంది. ప్రభాస్ ఇందులో ఆజాద్ హింద్ ఫోర్స్‌కు చెందిన సైనికుడిగా కనిపించనున్నారని టాక్. ఆయన పాత్రను 'మోస్ట్ వాంటెడ్ రివల్యూషనరీ'గా డిజైన్ చేశారట. ఈ క్యారెక్టర్ మహాభారతంలోని అర్జున, కర్ణ, ఏకలవ్య లక్షణాలను మేళవించిన లార్జర్ దెన్ లైఫ్ పాత్రగా ఉంటుందని దర్శకుడు హను రాఘవపూడి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు.

ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రెండో భాగం ప్రీక్వెల్‌గా ఉండబోతుందని, కథను మరింత లోతుగా చూపించేందుకు ఈ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారట. అంటే కథనం లీనియర్‌గా కాకుండా టైమ్‌లైన్‌ను బ్రేక్ చేస్తూ ముందుకు సాగనుందన్న మాట. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. హీరోయిన్‌గా ఇంటర్నెట్ సెన్సేషన్ ఇమాన్వి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇది ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్‌లో తొలి సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ సినిమాను మేకర్స్ 2026 ఆగస్టు 14న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లను అభిమానులు డీకోడ్ చేస్తూ, కథలో సుభాష్ చంద్రబోస్ లింక్ కూడా ఉండొచ్చని ఊహాగానాలు చేస్తున్నారు. ఇలా 'ఫౌజీ' ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X