Prabhas Villa: ఇటలీలో అద్దెకు ప్రభాస్ విల్లా.. నెలకు రెంట్ ఎంతో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఏ స్థాయిలో స్టార్ డమ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఇటీవల విడుదలైన ఆదిపురుష్ సినిమా చాలానే నిరాశ పరిచింది. ఇక సినిమాల ఫలితాలు పట్టించుకోనంత బిజీగా మిగతా చిత్రాలతో ప్రభాస్ ఉన్న విషయం తెలిసిందే. ఆదిపురుష్ సినిమాకు డార్లింగ్ రూ. 150 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ఇదివరకే వార్తలు రాగా ఇప్పుడు ఇలాంటి మరో టాపిక్ వైరల్ అవుతోంది. అదే ఇటలీలోని ప్రభాస్ విల్లా రెంట్ ధర. అసలు విషయంలోకి వెళితే..
ఒక్కసారిగా: దివంగత నటుడు కృష్ణంరాజు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు డార్లింగ్ ప్రభాస్. తన నటన, డ్యాన్స్, ఫైట్స్ అన్నిటికి మించి మ్యాన్లీ లుక్ తో అతి కొద్దిపాటి సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు. యంగ్ రెబల్ స్టార్ గా క్రేజ్ అందుకున్న ప్రభాస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

నిరుత్సాహం: బాహబలి ఫ్రాంచైజీ హిట్ తర్వాత నుంచి ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలే చేస్తూ వచ్చాడు. కానీ యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన సాహో, రాధా క్రిష్ణ కుమార్ రాధేశ్యామ్ చిత్రాలు రెండు ప్లాప్ గా మిగిలాయి. కానీ వసూళ్లు మాత్రం బాగానే తెచ్చిపెట్టాయి. దీంతో ప్రభాస్ అభిమానులు తెగ నిరుత్సాహపడ్డారు. ఇక జూన్ 16న రిలీజైన ఆదిపురుష్ సంగతి చెప్పాల్సిన పని లేదు.

ఐదారు సినిమాలు: ఆదిపురుష్ సినిమాకు ఆది నుంచే విమర్శలు వచ్చాయి. ఇక విడుదల తర్వాత అవి తీవ్రమయ్యాయి. ఇప్పుడు ప్రభాస్ తర్వాతి సినిమాలపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ చేతిలో ఏకంగా ఐదారు సినిమాలు ఉన్నాయని టాక్. కేజీఏఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్ట్ K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' సినిమాలు ఉన్నాయి.
క్రేజీ ప్రాజెక్ట్స్-భారీ పారితోషికం: అలాగే మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ మూవీ 'రాజా డీలక్స్' (ప్రచారంలో ఉన్న టైటిల్) ఉంది. అంతేకాకుండా పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ మూవీ, బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియాతో మరో చిత్రానికి ప్రభాస్ సై అన్నట్లు సమాచారం. ఇలా క్రేజీ ప్రాజెక్ట్సుతో సుమారు రూ. 150 కోట్ల పారితోషికంతో ప్రభాస్ కెరీర్ దూసుకెళ్తుంది.

నెలకు అన్ని లక్షలు: ఇదిలా ఉంటే ప్రభాస్ తన సంపాదనలో కొంత మొత్తాన్ని విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాడని, అందులో భాగంగానే ఇటలీలో ఓ విలాసవంతమైన విల్లాను గతంలో కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఖాళీగా ఉండే ఈ విల్లాను ప్రభాస్ అద్దెకు ఇస్తున్నాడని ఇప్పుడున్న న్యూస్. ఇటలీకి వచ్చే పర్యాటకులు, స్థానికంగా ఉండే రిచ్ పర్సన్స్ కి ఈ విల్లాను నెలకు రూ. 40 లక్షల రెంట్ తో అద్దెకు ఇస్తున్నాడని టాక్. ఇలా ప్రభాస్ ఖాతాలో ప్రతి నెల రూ. 40 లక్షలు పడుతున్నాయన్న ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు.


Click it and Unblock the Notifications











