ఆ పురాతన ఆలయంలో ప్రభాస్ పెద్దమ్మ ప్రత్యేక పూజలు.. డార్లింగ్ పెళ్లి కోసమేనా?
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే ఖచ్చితంగా వినిపించే పేరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. 50కి చేరువు అవుతున్నా ఇంతవరకు ఆయన పెళ్లి చేసుకోకపోవడం కుటుంబ సభ్యులను, అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ప్రభాస్ పెళ్లిపై ఎప్పటికప్పుడు పుకార్లు రావడం తర్వాత గాలివార్తలుగా మిగిలిపోవడం జరుగుతూ వస్తోంది. ఇక కొందరు జ్యోతిష్యులైతే ప్రభాస్ పెళ్లి, వైవాహిక జీవితంపై రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ అభిమానులను మరింత టెన్షన్ పెడుతున్నారు.
అనుష్కతో ప్రభాస్ డేటింగ్?
ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎప్పుడొచ్చినా వధువు ప్లేస్‌లో వినిపించే పేరు సినీనటి అనుష్క. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని.. ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. 2009లో బిల్లా సినిమా సమయంలో అనుష్క- ప్రభాస్ కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని ఫిలింనగర్‌లో నేటీకి కథలు కథలుగా చెప్పుకుంటారు. దాదాపు 16 ఏళ్లు కావొస్తున్నా ఈ పుకార్లకు ఏమాత్రం చెక్ పడటం లేదు. తమ మధ్య ఏం లేదని వీరిద్దరూ పలుమార్లు క్లారిటీ ఇచ్చినా గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

ప్రభాస్ పెళ్లిపై గాసిప్స్
గతేడాది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి నిశ్చయమైనట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి సీక్రెట్‌గా చూసుకుంటున్నారని పుకార్లు వినిపించాయి. ఏకంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ షోలోనూ ప్రభాస్ పెళ్లిపై అతని బెస్ట్ ఫ్రెండ్, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ను బాలయ్య ఆరా తీశారు. ఏపీలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని చరణ్ క్లూ కూడా ఇచ్చారు.
ప్రభాస్ పెళ్లి కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
ఆ తర్వాత కొద్దిరోజులకే ప్రభాస్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా చెల్లెళ్లు ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తిలు అందంగా ముస్తాబైన ఫోటోలు బయటకు రావడంతో.. ప్రభాస్ ఇంట్లో ఏదో జరుగుతుందని మీడియా అటువైపు కన్నేసింది. కట్ చేస్తే అది బంధువుల పెళ్లి అని.. దానికి సంబంధించిన ఫోటోలే బయటికి వచ్చినట్లు తర్వాత తేలింది. దాంతో మరోసారి ప్రభాస్ అభిమానులు షాక్ అయ్యారు. త్వరగా అన్న పెళ్లి చేయండి అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఆ ఆలయంలో శ్యామలా దేవి పూజలు
తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తునిలోని వెలిసిన పురాతన తలుపులమ్మ లోవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ప్రభాస్ పేరిట అమ్మవారికి కుంకుమార్చన చేయించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ పెళ్లి త్వరగా చేసుకోవాలని, పెళ్లికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని జరిపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ప్రభాస్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మోకాలి నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో డార్లింగ్ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కెరీర్, ఆరోగ్యం బాగుండాలని శ్యామలా దేవి ఈ పూజలు చేయించినట్లుగా ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు. మరి దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











