twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌ను టార్చర్ పెడుతున్న పొలిటీషియన్ కూతురు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ అండ్ హాండ్సమ్ హీరో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కాలేజీ స్టూడెంట్స్‌తో పాటు అటు ఫ్యామిలీ ప్రేక్షకుల్లోనూ ప్రభాస్ సినిమాలంటే మహా క్రేజీ. ఇలాంటి అభిమానుల్లో రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కూతురు కూడా ఉందట.

    రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందిన ఆమె ఈ మధ్య తరచూ ప్రభాస్‌ను కలుస్తోందట. అభిమానంతో వస్తుంది కదా అని మొదట్లో లైట్ తీసుకున్న ప్రభాస్‌కు....ఈ మధ్య ఆవిడ టార్చర్ మరీ ఎక్కువైందని ఫిల్మ్ నగర్ టాక్. ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రభాస్ పై ఒత్తిడి తెస్తోందని, నువ్వులేకుండా బ్రతకలేనని ప్రభాస్ వెంటపడుతోందని సమాచారం.

    ఆవిడ వ్యవహారం మూలంగా బాగా డిస్ట్రర్బ్ అవుతున్న ప్రభాస్...ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దల వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లాడని, వారు సదరు పొలిటీషియన్ కుటుంబాన్ని సంప్రదించి ఆవిడ టార్చర్ నుంచి ప్రభాస్ ను బయట పడే ప్రయత్నం చేస్తున్నార టాక్. ప్రభాస్‌కు ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదని, దయచేసి అతన్ని ఇబ్బంది పెట్టవద్దని ఇండస్ట్రీ పెద్దలు సదరు రాజకీయ నాయకుడి ఫ్యామిలీని కోరినట్లు సమాచారం.

    ప్రభాస్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'బహుబలి' సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ కాకతీయ కింగ్ గా కనిపించబోతున్నాడు. భారీ యుద్ధ పోరాటాలు, కత్తి పోరాటాలు సినిమాలో భాగమే. ఈ సినిమా కోసం భారీగా గడ్డం పెంచిన ప్రభాస్ ఇలా ఎవరూ గుర్తు పట్టని విధంగా తయ్యారు. ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్ కాగా, రాణా విలన్ పాత్ర పోషిస్తున్నాడు. అడవిశేష్, ఈగ ఫేం సుదీప్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    Film Nagar Rumours in that, Actor Prabhas facing trouble with Politician’s daughter. This girl is head over heals in love with Prabhas. He is being harassed with these overtures to such an extent that he had to run off to Mumbai to avoid the torture.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X