డార్లింగ్ తో డీప్ లవ్ లో మునిగితేలుతున్న ప్రభాస్...!?
వెంటవెంటనే సినిమాలు చేసే హిట్ పెయిర్ మద్య ఏదో వ్యవహారం నడుస్తుంది అనే పుకార్లు సినీ పరిశ్రమలో సాధారణం. అయితే ప్రభాస్, కాజల్ ప్రేమ వ్యవహారంపై మీడియా మౌనంగానే ఉన్నా సినీ జనం మాత్రం తెగ చెవులు కోరికేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్.
దశరద్ తో సినిమా కోసం దిల్ రాజు ఒక పంజాబే అమ్మాయిని సెలక్ట్ చేస్తే ప్రభాస్ ఆమెని రిజెక్ట్ చేసి కాజల్ ని కోరుకున్నాడట. అంతేకాకుండా మున్నా టైంలో ఇలియానాతో కాస్త వ్యవహారం నడిపిన ప్రభాస్, కాజల్ మాటర్ ని మాత్రం సీరియస్ గా తీసుకున్నాడట.
ప్రభాస్, కాజల్ తో ఘాటు ప్రేమలో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ కలిసి ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో నటిస్తున్నారు. తండ్రి మరణంతో కంగిపోయిన ప్రభాస్, కాజల్ ప్రేమతో తేరుకున్నాడని కూడా కొంతమంది మాట్టాడుకుంటున్నారు. తన ప్రేమ వ్యవహారం అమ్మ దగ్గర చెప్పి ఆమెను ఎలాగైనా ఒప్పించి కాజల్ ను పెళ్ళి చేసుకోవాలని ప్రభాస్ అనుకుంటున్నాడట. కాజల్ కూడా ప్రభాస్ ను అమితంగా ఇష్టపడుతోందని సమాచారం. ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియదుకాని, ఇప్పటి వరకూ ప్రభాస్ వైపు కానీ కాజల్ వైపు నుంచి దీని పై ఎలాంటి స్పందన రాలేదు.


Click it and Unblock the Notifications











