ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు షాక్.. ‘ఫౌజీ' విడుదల అప్పుడేనా? మరీ ‘స్పిరిట్‌' పరిస్థితేంటీ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే.. అనుకున్న స్థాయి విజయాన్ని సాధించలేకోపోయింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ రానున్న సినిమాల కోసం అత్రుతగా వేచి చూస్తున్నారు.ఈ తరుణంతో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది. ఈ డిలే ప్రభాస్ రాబోయే ప్రాజెక్ట్స్‌పై కూడా ప్రభావం చూపేలా ఉంది. ఫౌజీని ఆగస్టులో విడుదల చేయాలని భావించిన అనుకున్న సమయానికి షెడ్యూల్స్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో 'ఫౌజీ' ఎప్పుడు వస్తుంది? 'కల్కి 2', 'స్పిరిట్' పరిస్థితి ఏమిటి? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమా విడుదల మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట ఈ దసరా లేదా ఆగస్టు రిలీజ్‌గా ప్లాన్ చేసినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2024లోనే సెట్స్‌పైకి వెళ్లింది,కానీ, ఇప్పటికీ షూటింగ్ పూర్తి కాలేదని సమాచారం. ముఖ్యంగా భారీ స్థాయిలో CGI వర్క్ ఉండటం, పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల సినిమా ఆలస్యం అవుతోంది. విజువల్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని మేకర్స్ భావించడంతో విడుదలను త్వరగా వాయిదా వేస్తున్నట్లు టాక్.

Prabhas Fauji postpone December Release Buzz Spirit amp amp Kalki 2 Affected

ప్రస్తుతం 'ఫౌజీ' కోసం డిసెంబర్ రిలీజ్‌ను చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా డిసెంబర్ 4 తేదీని టార్గెట్‌గా పెట్టుకున్నారనే ప్రచారం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే పనులు మరింత ఆలస్యమైతే, ఈ చిత్రం 2027 సంక్రాంతికి వెళ్లే అవకాశాలు కూడా పూర్తిగా తోసిపుచ్చలేమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక 'ఫౌజీ' ఆలస్యం అవ్వడం వల్ల ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్‌లపై కూడా ప్రభావం పడుతోంది. ముఖ్యంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాల్సిన 'స్పిరిట్' సినిమా షూటింగ్ కూడా డిలే కావొచ్చు. ప్రభాస్ డేట్స్ క్లియర్ కాబోయే ప్రాజెక్ట్ ప్రారంభం మరింత వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడనున్నది.

అదేవిధంగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కల్కి 2898 AD పార్ట్ 2' షూటింగ్ కూడా ప్రభాస్ డేట్స్ కోసం వేచి ఉంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ నటులతో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినప్పటికీ, ప్రభాస్ సెట్స్‌లోకి ఎంటర్ అయ్యాకే ప్రధాన భాగం పూర్తవుతుంది. సమాచారం ప్రకారం.. ప్రభాస్ ఆగస్టు 10 తర్వాత ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ప్రభాస్ ప్రస్తుతం సమ్మర్ బ్రేక్ కోసం ఇటలీకి వెళ్లినట్లు సమాచారం. దాదాపు 10-15 రోజుల పాటు అక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో 'ఫౌజీ' సెట్స్‌లో ఆయన తిరిగి చేరడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

'ఫౌజీ' కథాంశం కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది. మహాభారతంలో కర్ణుడు పాండవుల వైపు నిలబడి ఉంటే కథ ఎలా మారేది? అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన ఈ ఐడియా ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయిల్‌ను పరిచయం చేస్తుండగా, సంగీత విశాల్ చంద్రశేఖర్ అందించారు. 'సీతా రామం' వంటి క్లాసిక్ తర్వాత హను-విశాల్ కాంబో మళ్లీ రావడం కూడా మరో ప్లస్ పాయింట్‌గా మారింది.

ఇలా 'ఫౌజీ' ఆలస్యం అవుతున్నా... మేకర్స్ మాత్రం క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా, భారీ విజువల్ అనుభూతిని కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డిలే వల్ల 'స్పిరిట్', 'కల్కి 2' వంటి ప్రాజెక్ట్స్‌పై ప్రభావం పడటం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. మరి 'ఫౌజీ' ఫైనల్ రిలీజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ అవుతుంది? ప్రభాస్ తన భారీ లైన్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తాడు? అనే వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X