Salaar: అన్ని వందల మందితో ప్రభాస్.. తెలుగులో ఎప్పుడూ చూడని విధంగా!
టాలీవుడ్‌లో ఇప్పుడు చాలా మంది స్టార్లు ఉన్నారు. కానీ, వారిలో కొందరు మాత్రమే దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను ఏర్పరచుకుని పాన్ ఇండియా స్టార్లుగా వెలుగొందుతోన్నారు. అందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పేరు ప్రభాస్. 'బాహుబలి'తో నేషనల్ స్టార్ అయిన అతడు.. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు. సినిమాల ఫలితాలను లెక్క చేయకుండా మూవీలు చేస్తూనే ఉన్నాడు. అలా తన అభిమానులతో పాటు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాడు. అలా ఇప్పుడు ప్రభాస్ ఏకంగా నాలుగైదు ప్రాజెక్టులను చేస్తోన్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తోన్న చిత్రాల్లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా వస్తోన్న 'సలార్' ఒకటి. 'కేజీఎఫ్' ఫేం ప్రశాంత్ నీల్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ చిత్ర షూటింగ్.. కొన్ని కొన్ని విరామాలతో చిన్నగా సాగుతోంది. అయినప్పటికీ ఇలా దాదాపు సగం కంటే ఎక్కువ షూటింగ్‌ను చిత్ర యూనిట్ పూర్తి చేసుకుంది. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. అనుకున్న సమయానికి దీన్ని విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' మూవీలో ఎన్నో హైలైట్లు ఉండబోతున్నాయని ఇప్పటికే చిత్ర యూనిట్ చెప్పింది. ఈ క్రమంలోనే తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీలో క్లైమాక్స్ సీక్వెన్స్ తెలుగులో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా డిజైన్ చేశారట. అంతేకాదు, ఇందులో ప్రభాస్ ఏకంగా 400 మంది ఫైటర్లతో పోరాటం చేయబోతున్నాడని తెలిసింది. ఈ సీక్వెన్స్ కోసమే విదేశాలకు చెందిన టెక్నీషియన్లను తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఇది ఈ చిత్రంలోనే హైలైట్ కాబోతుందని సమాచారం.
భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో విలన్‌లుగా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











