twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌కు సరికొత్త ‘పెళ్లి’ ప్రపోజల్.. నాన్చుడు ధోరణి.. ఓకే చెప్తాడో లేదో..

    By Rajababu
    |

    Recommended Video

    ప్రభాస్‌కు సరికొత్త ‘పెళ్లి’ ప్రపోజల్.. ఓకే చెప్తాడో లేదో..

    ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సంగతి తెలిసిందే. బాహుబలి ఘనవిజయం తర్వాత ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయి. పెదనాన్న కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి సంబంధాల కుదర్చడంపై దృష్టిపెట్టాడు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభాస్‌కు వచ్చిన ఓ ప్రపోజల్ చాలా ఆసక్తికరంగా మారింది. అదేమింటంటే..

    ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్‌

    ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్‌

    బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ప్రభాస్ యాక్టర్ కంటే ఓ బ్రాండ్‌గా మారిపోయారు. బాహుబలి2 తర్వాత దేశవ్యాప్తంగా పేరొందిన పలు పారిశ్రామిక సంస్థలు తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని రిక్వెస్ట్ చేశాయి. అయితే కొన్నింటిని అంగీకరించగా, మరికొన్నింటిని సున్నితంగా తిరస్కరించారనేది సినీ వర్గాల టాక్.

     ప్రభాస్‌కు మ్యాట్రిమోని ఆఫర్

    ప్రభాస్‌కు మ్యాట్రిమోని ఆఫర్

    ఇదిలా ఉండగా, బ్యాచ్‌లర్‌ అయిన ప్రభాస్‌ను తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని ఓ మ్యాట్రిమోనియల్ (పెళ్లిళ్లు కుదిర్చే) కంపెనీలు తాజాగా ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. పెళ్లి సంబంధాలు చూసే తమ వెబ్‌సైట్‌కు ప్రచారం చేయాలని, అందుకు భారీగా రెమ్యునరేషన్ ఇస్తామని ఓ ప్రపోజల్ పంపడం జరిగిందట.

     యంగ్ రెబల్‌స్టార్‌తో సంప్రదింపులు

    యంగ్ రెబల్‌స్టార్‌తో సంప్రదింపులు

    ప్రభాస్‌తో మ్యాట్రిమోని వెబ్‌సైట్ నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే వారి ప్రతిపాదనకు యంగ్ టైగర్ ప్రభాస్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని విశ్వసనీయమైన సమాచారం. ఆ ఎండార్స్‌మెంట్‌ ప్రపోజల్‌ను యంగ్ రెబల్‌స్టార్ అంగీకరిస్తారా లేదా తిరస్కరిస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

     సాహో షూటింగ్‌లో బిజీ

    సాహో షూటింగ్‌లో బిజీ

    ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్‌లో ప్రభాస్ బిజీగా ఉన్నారు. అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ‌తో రూపొందుతున్న యాక్షన్ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం 2018లో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది.

    English summary
    Baahubali star Prabhas is undoubtedly the most eligible bachelor in our country. Ever since the magnum opus hit the screens, women across the globe have been going gaga over the actor. In fact, it was reported that Prabhas was flooded with marriage proposals.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X