ప్రభాస్ పెళ్లి ఆలస్యం ఎందుకు అవుతుందంటే.. ఫ్యామిలీ సభ్యులు చెప్పిందేమిటంటే..
Recommended Video

టాలీవుడ్‌లోని హాటెస్ట్ టాపిక్స్‌లో ప్రభాస్ పెళ్లి ఒకటి. గతవారం పుట్టిన జరుపుకొన్న నేపథ్యంలో వచ్చే ఏడాది పెళ్లి జరిగే అవకాశముందనే రూమర్ మరోసారి విజృంభించింది. అయితే పెళ్లి విషయంలో ప్రభాస్ అంత తొందరపడుతున్నట్టుగా కనిపించడం లేదు. ఎప్పుడైతే అప్పుడు అన్నట్టు తాపీగా ఉన్నాడనే మాట వినిపిస్తున్నది. అయితే మీడియాలో మాత్రం ప్రభాస్ పెళ్లి వార్త ప్రస్తుతం మరింత హాట్‌గా మారింది. ప్రభాస్ పెళ్లి గురించిన వార్త తాజాగా వెలుగులోకి వచ్చిందేమిటంటే...

ప్రభాస్ తల్లి ఆలోచన ఏంటంటే
తాజాగా ప్రభాస్ పెళ్లి 2019లో జరగడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తున్నది. ఇప్పటికే 40 పడిలోకి అడుగుపెట్టిన యంగ్ రెబల్ స్టార్ పెళ్లిని నాన్చడం తన కుటుంబానికి ఇష్టం లేదనేది తాజా సమాచారం. ఎంత తొందరగా అయితే అంత తొందరగా కోడలిని ఇంటికి తీసుకురావాలనే ఆలోచనలో ప్రభాస్ తల్లి తన ప్రయత్నాలను మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది.

సాఫ్ట్ ఇంజినీర్‌తో ప్రభాస్ పెళ్లి
ప్రభాస్‌తో పెళ్లి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో జరిగే అవకాశం ఉంది. అయితే ఆ విషయంపై మాట, ముచ్చట ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. ఇంకా దానిపై క్లారిటీ రాలేదని ఆ వార్త సారాంశం. ఒకసారి అన్ని వ్యవహారాలు కుదిరితే 2019లో పెళ్లి జరిపించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు సమాచారం.

సాహో సినిమా కారణంగా
ప్రభాస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి చెప్పిన ప్రకారం... బాహుబలి తర్వాత యంగ్ రెబల్‌స్టార్ పెళ్లి చేసుకోవాలని భావించాడు. అయితే సాహో చిత్రం తెరపైకి వచ్చింది. ఆ చిత్రం కోసం ప్రభాస్ ఎక్కువగా శ్రమించాల్సి ఉండటం, ఎక్కువగా యాక్షన్ సీన్లలో పాల్గొనాల్సి రావడంతో పెళ్లి ఆలోచనను మానుకొన్నారు. దాంతో ప్రభాస్ పెళ్లి మరింత ఆలస్యమైంది.

2019 సంవత్సరం చివర్లో
సాహో చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇంకా కొంత షూటింగ్ జరుగాల్సిన పనికూడా ఉంది. అయితే సాహో చిత్రం 2019 మధ్యభాగంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సాహో రిలీజ్ తర్వాత సుమారుగా 2019 చివర్లో ప్రభాస్ పెళ్లికి ముహుర్తాలు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

నా ప్రైవేట్ అఫైర్ అని
బాహుబలి తర్వాత అనుష్క, ప్రభాస్ పెళ్లి విషయం మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ప్రభాస్ సమాధానం ఇస్తూ.. నా వ్యక్తిగత వ్యవహారాల గురించి విపులంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది నా పెళ్లి గురించి ప్రస్తావిస్తున్నారు. కానీ వారు అలాంటి ప్రశ్నలను అడగకూడదు. నా పెళ్లి అనేది నాకు సంబంధించిన ప్రైవేట్ అఫైర్. దానిని ప్రైవసీకి భంగం కలిగించకూడదు అని ప్రభాస్ వెల్లడించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











