Prabhas: ఏంటి.. ప్రభాస్‌కు పెళ్లయిపోయిందా... షాకింగ్ ట్విస్ట్ వైరల్!

కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ మొదటి భాగం గతేడాది డిసెంబర్​లో విడుదలై ఆడియెన్స్ విపరీతంగా ఆకట్టుకుంది. స్టోరీ కాస్త కన్ఫ్యూజన్​గా అనిపించినా ప్రభాస్​ యాక్షన్​ మోడ్​తో సినిమా అందరికీ తెగ నచ్చేసింది.

బాక్సాఫీస్ వద్ద రూ.700కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. అయితే ఈ తొలి భాగంలో ప్రభాస్​కు పెళ్లి అయినట్లు సీన్​ ఉందని మీకు తెలుసా? అది కూడా శ్రుతిహాసన్​తో కాదు. మరో హీరోయిన్​తో! అదేంటే థియేటర్​లో కనపడలేదే అని అనుకుంటున్నారా? శ్రుతిహాసన్ కాకుండా మరో హీరోయిన్​ ఎక్కడుంది అని ఆలోచిస్తున్నారా? అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి..

Prabhas Get Married in Prashanth Neel Salaar 2 Movie News Goes Viral

బాహుబలి తర్వాత సరైన గ్రాండ్ హిట్​ కోసం ఎంతో కాలం వెయిట్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​కు సలార్​తో ఆ ఆకలి తీరింది. కేజీయఫ్​ ఫేమ్​ ప్రశాంత్ నీల్ భారీ బడ్జెట్​తో దీన్ని తెరకెక్కించారు. రిలీజ్​కు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకుంది. డైలాగ్స్ చాలా తక్కువగానే ఉన్నప్పటికీ, డార్లింగ్​ కేవలం తన కటౌట్​తోనే మూవీని ఓ రేంజ్​కు తీసుకెళ్లారు. తన స్క్రీన్ ప్రెజెన్స్​తోనే ఫ్యాన్స్​కు గూస్‌బంప్స్ తెప్పించారు. దీంతో ప్రభాస్ కటౌట్​కు, యాక్షన్​ మోడ్​కు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ ఫిదా అయిపోయారు.

ఇక ఈ చిత్రానికి రెండో భాగం కూడా త్వరలోనే రానుంది. శౌర్యంగా పర్వం పేరుతో పార్ట్ 2ను ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం షూటింగ్​తో పాటు పోస్ట్ ప్రొడక్షన్​ పనులు జరుపుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ చిత్రం నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు కానీ ఓ విషయం మాత్రం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Prabhas Get Married in Prashanth Neel Salaar 2 Movie News Goes Viral

అదేంటంటే వాస్తవానికి సలార్ సీజ్​ ఫైర్ తొలి భాగంలో ప్రభాస్​ను కేవలం యాక్షన్​ మోడ్​ లేదా సైలెంట్​ మోడ్​లోనే చూపించారు. ఎక్కడా రొమాంటిక్ యాంగిల్​ను టచ్​ చేయలేదు. అయితే సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తొలి భాగంలో ప్రభాస్​కు పెళ్లి సీన్ ఉందట. దాన్ని చిత్రీకరించారంట కూడా. కానీ ఎడిటింగ్​లో దాన్ని ట్రిమ్​ చేసి పక్కన పెట్టారని తెలిసింది. అయితే ప్రభాస్ పెళ్లి సీన్​ శృతిహాసన్ కాదని కూడా తెలిసింది. సినిమాలో మరో హీరోయిన్ ఉందట. ఆమె ప్రభాస్ భార్యగా నటిస్తుంది అని, ఆ ట్విస్ట్​ సీక్రెట్​ను శౌర్యంగా పర్వంలో రివీల్ చేయబోతున్నారని అంటున్నారు.

ఇక ఈ విషయం తెలుసుకుంటున్న ప్రభాస్ అభిమానులు షాకై పోతున్నారు. సినిమాపై మరింత హ్యూజ్ ఎక్స్​పెక్టేషన్స్​ను పెంచేసుకుంటున్నారు. ఇంత పెద్ద షాకింగ్ ట్విస్ట్ ఎక్కడ దాచావ్​ ప్రశాంత్ మావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఎవరా రెండో హీరోయిన్ అంటూ తెగ చర్చించుకుంటున్నారు. మరి వీటికి సమాధానాలు దొరకాలంటే శౌర్యంగా పర్వం రిలీజ్ అయ్యే వరకు వేచి ఉండాల్సిందే. థియేటర్లలోనే ఆ ట్విస్ట్​ను ప్రశాంత్ నీల్​ రివిల్ చేయబోతున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X