ప్రభాస్‌కు అక్కడ సర్జరీ.. అమెరికాకు పయనం.. ఆందోళనలో అభిమానులు
దివంగత కష్ణంరాజు నట వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇక బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ ఎదిగాడు. ఆ సినిమా నుంచి ప్రభాస్ చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తూ అలరిస్తున్నాడు. ఆయన సినిమాలకు నెగెటివ్ టాక్ వచ్చిన తర్వాతి ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల ప్రభాస్ కు సర్జరీ కానుందని తెగ వార్తలు వస్తున్నాయి. తాజాగా అవి మరోసారి గుప్పుమన్నాయి.
అలా ఎంటర్టైన్: పెద్ద సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు డార్లింగ్ ప్రభాస్. ఎంతో కాలంగా తెలుగులో సత్తా చాటుతున్న ప్రభాస్.. దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దీంతో అప్పటి నుంచి భారీ బడ్జెట్ చిత్రాలను చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు.

నెగెటివిటీ మాయం: బాహుబలి తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలకు ఆశించినంతగా విజయం రాకపోవడంతో ప్రభాస్ తన తర్వాత సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడీ టైటిల్ గ్లింప్స్ చేశారు. ఆ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంతకుముందు వచ్చినా నెగెటివిటీ ఒక్కసారిగా పటాపంచలు అయింది.

సినిమాల లిస్ట్: ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో కల్కితో పాటు మరో ఐదు సినిమాలు ఉన్నాయి. వాటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మారుతితో హారర్ కామెడీ చిత్రంగా 'రాజా డీలక్స్' ఉండగా.. మరో బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ మూవీ, ఆర్కా మీడియా పతాకంపై ఓ చిత్రం ఉంది.

ఫైటింగ్ సీన్స్: అయితే ప్రభాస్ చేతిలో మొత్తగా ఐదారు సినిమాలు ఉండగా.. వాటిలో సలార్ సెప్టెంబర్ లో విడుదలకు రెడీగా ఉంది. దీంతో డార్లింగ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ తన యాక్టింగ్ తోపాటు అదిరిపోయే ఫైట్ సన్నివేశాలతో ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తాడు. రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ అలా ఫైటింగ్ సీన్స్ చేసి చాలా కాలం అవుతుంది.
అమెరికాకు: ప్రభాస్ చాలా కాలంగా ఫైట్ సీన్స్ చేయకపోవడానికి పాన్ ఇండియా సినిమాలు ఒక కారణం అయితే.. అతన్ని వేధిస్తున్న మోకాలి నొప్పి మరొకటి. బాహుబలి కోసం నెలల తరబడి యాక్షన్ సీన్స్ చేయడంతో ప్రభాస్ కు మోకాలి నొప్పి సమస్య వచ్చింది. ఇప్పటికి అది తగ్గలేదని టాక్. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు ఆ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టనున్నాడు డార్లింగ్. మోకాలికి సర్జరీ కోసం అమెరికాకు పయనం కానున్నాడట ప్రభాస్. దీంతో తర్వాతి సినిమాల్లో మళ్లీ పాత రెబల్ స్టార్ యాక్షన్ సీన్స్ చూడొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











