ప్రభాస్ అభిమానులకు శుభవార్త: రాధాకృష్ణ ఇలా ఫిక్స్ చేసేశారు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తాజా సినిమాను జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ ప్రభాస్ అభిమానుల్లో ఆనందం నింపుతోంది. వివరాల్లోకి పోతే..

'సాహో' డిజాస్టర్.. అభిమానుల ఆశలు

'సాహో' డిజాస్టర్.. అభిమానుల ఆశలు

బాహుబలి సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న ప్రభాస్.. ఆ తర్వాత 'సాహో' సినిమా ద్వారా ఆశించిన ఫలితం రాబట్టలేక పోయాడు. దీంతో నిరాశ చెందిన యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ మేరకు రాధాకృష్ణ సైతం ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు.

ప్రభాస్ 20.. టైటిల్ ఇదే

ప్రభాస్ 20.. టైటిల్ ఇదే

ప్రభాస్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట 'జాను' అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత.. 'ఓ డియర్', 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ పరిశీలనలో పెట్టారు. ఈ రెండిటిలో ఓ టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట డైరెక్టర్ రాధాకృష్ణ.

పూజా హెగ్డేతో రొమాన్స్.. ప్రభాస్ పాత్ర

పూజా హెగ్డేతో రొమాన్స్.. ప్రభాస్ పాత్ర

యూవీ క్రియేషన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోందని, ఇందులో ప్రభాస్ పాత్ర గతంలో ఎన్నడూ చూసని విధంగా ఉంటుందని తెలుస్తోంది.

రిలీజ్ డేట్ ఫిక్స్..

రిలీజ్ డేట్ ఫిక్స్..

భారీ హంగులతో రూపొందుతున్న ఈ సినిమాను దసరా సీజన్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. ఈ మేరకు అక్టోబర్ 16ను విడుదల తేదీగా లాక్ చేశారని సమాచారం. త్వరలోనే అధికారికంగా ఈ తేదీని ప్రకటించనున్నారని లేటెస్ట్ అప్‌డేట్.

డైరెక్టర్ రాధాకృష్ణ డిసీజన్.. అభిమానుల సంబరాలు

డైరెక్టర్ రాధాకృష్ణ డిసీజన్.. అభిమానుల సంబరాలు

నిజానికి ఈ సినిమాను 2021లో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులను దృష్టిలో పెట్టుకొని ఇలా దసరా కానుకగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట డైరెక్టర్ రాధాకృష్ణ. ఇందులో నిజానిజాల సంగతి అటుంచితే ఈ వార్త మాత్రం ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X