twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్లానింగ్ బాగుంది :ప్రభాస్, గోపిచంద్ గెస్ట్ లు

    By Srikanya
    |

    హైదరాబాద్ : యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ప్రభాస్, గోపీచంద్ గెస్ట్ లుగా ఓ ఆడియో పంక్షన్ కి వస్తున్నారంటే ఆ లుక్కే మారిపోతుంది. అలాంటి అవకాసం ఇప్పుడు శర్వానంద్ తాజా చిత్రానికి దక్కిందని వినికిడి. శర్వానంద్, సీరత్ కపూర్ లు జంటగా సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రన్ రాజా రన్''. ఈ చిత్రం ఆడియో పంక్షన్ కి వీరిద్దరూ హాజరవుతున్నారని సినీ వర్గాల సమాచారం. ప్రభాస్ ఇదే బ్యానర్ లో మిర్చి చిత్రం చేసారు. అలాగే గోపిచంద్ ఇప్పుడు రాధాకృష్ణ అనే కొత్త దర్శకుడు డైరక్షన్ లో ఇదే బ్యానర్ లో చిత్రం చేస్తున్నారు. దాంతో నిర్మాతతో ఉన్న అనుభంధం దృష్ట్యా వీరిద్దరూ వస్తారని తెలుస్తోంది.

    ప్రభాస్ హీరోగా తొలి యత్నంలోనే 'మిర్చి' వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన యు.వి. క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ తమ రెండో చిత్రాన్ని శర్వానంద్ హీరోగా నిర్మిస్తున్నారు. దీనికి 'రన్ రాజా రన్' అనే టైటిల్ ఖరారు చేశారు. సీరత్ కపూర్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకునిగా సుజీత్ పరిచయమవుతున్నారు.

    Prabhas, Gopichand releases ‘Run Raja Run’ audio

    నిర్మాతలు మాట్లాడుతూ "లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'రన్ రాజా రన్' రూపొందుతోంది. ఇందులో కథ ఉత్కంఠభరితంగా నడుస్తుంది. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే అంశాలు ఉన్నాయి. కథకు టైటిల్ సరిగ్గా సరిపోయింది. ఈ చిత్రంలో కథకు అవసరమైన పాత్రలే ఉంటాయి. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో దీన్ని నిర్మిస్తున్నాం'' అని చెప్పారు.

    అడివి శేష్, సంపత్, జయప్రకాశ్‌రెడ్డి, వెన్నెల కిశోర్, అలీ, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అజయ్ ఘోష్ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: ఘిబ్రాన్ ఎం., ఛాయాగ్రహణం: మధి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.

    English summary
    Prabhas and Gopichand will be gracing r ‘Run Raja Run’ audio launch. Vamsi and Pramod who produced Prabhas' Mirchi’ on UV.Creations banner are the producers for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X