పవన్ OGలో ప్రభాస్, నాని.. సుజీత్ కొత్త యూనివర్స్.. డార్లింగ్ ఎంట్రీ ఎలా అంటే?

తెలుగు ప్రజల్లో పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్​కు ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్​లు ఫ్లాప్​లు అంటూ తేడా లేకుండా ఎలాంటి క్రేజ్​ తగ్గని హీరోగా సత్తా చాటుతున్నాడు. ఎన్ని ఓటమిలు ఎదురైనా ఫ్యాన్స్ మాత్రం తగ్గని ఏకైక హీరో పవన్. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అందులో భాగంగానే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) అనే మూవీ చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ నటించనున్నాడనే క్రేజీ వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది.

యాక్టివ్ గా ఉంటూనే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత సినిమాలకు కొంత కాలం గ్యాప్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఓవైపు పాలిటిక్స్ లో సూపర్ యాక్టివ్ గా ఉంటూనే మరోవైపు వరుస పెట్టి సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ తర్వాత భీమ్లా నాయక్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు.

 ogprabhas

సాయి ధరమ్ తేజ్ కూడా

ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు ఓ టాక్ అయితే నడుస్తోంది. ఈ సినిమానే కాకుండా పవన్ కల్యాణ్ వినోదయ సీతమ్ రీమేక్ మూవీ చేస్తున్నాడు. ఇందులో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నట్లు సమాచారం.

వకీల్ సాబ్ 2

ఇక గబ్బర్ సింగ్ మూవీతో కెరియర్ రికార్డ్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను లైన్ లో పెట్డాడు పవన్ కల్యాణ్. అంతేకాకుండా ఇటీవలే వకీల్ సాబ్ 2ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఆ మూవీ డైరెక్టర్ వేణు శ్రీరామ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలే కాకుండా పవన్ కల్యాణ్ OG అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

 og

ప్రభాస్ అప్పిరియెన్స్

ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) సినిమాకు యంగ్ ఏజ్ లోనే ప్రభాస్ తో సాహో వంటి పాన్ ఇండియా మూవీని డైరెక్ట్ చేసిన సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. RRR నిర్మాత డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో మలయాళ క్యూట్ బ్యూటి ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ అప్పిరియెన్స్ ఉండనుందని తాజాగా న్యూస్ తెగ స్ప్రెడ్ అవుతోంది.

సుజీత్ సర్ ప్రైజ్

OG సినిమాలో పవన్ తోపాటు ఓ కీలక పాత్ర పోషించేందుకు ఒక పేరున్న హీరో అసరం పడిందని.. అందుకు కన్నడ హీరో రక్షిత్ శెట్టిని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. తర్వాత నేచురల్ స్టార్ నానితో చిత్రబృందం సంప్రదింపులు జరిపినట్లుగా న్యూస్ వచ్చింది. ఆ పాత్ర చాలా కీలకమైనది కాబట్టి నాని కూడా ఒప్పుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పుడు దానికి మించిన సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడట డైరెక్టర్ సుజీత్.

 og

సాహోకు లింక్ చేస్తూ

పవన్ OGకి ప్రభాస్ సాహో చిత్రానికి లింక్ చేస్తూ ఒక యూనివర్స్ ను సుజీత్ క్రియేట్ చేస్తున్నాడని టాక్. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ క్లైమాక్స్ లో ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి చాలా మంది డైరెక్టర్స్ ఇలా యూనివర్స్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇక సుజీత్ వంటి యువ దర్శకుడు కొత్త యూనివర్స్ క్రియేట్ చేయడంలో సందేహం లేదు. ఒక వేళ ఈ న్యూస్ నిజమైతే పవన్ మూవీలో ప్రభాస్ కనిపిస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుందని పలువురు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X