Prabhas: లవ్ స్టోరీకి రూ.300 కోట్లు... మళ్లీ అదే తప్పు చేస్తున్న ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాలిడ్ హిట్ కొడితే చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ ప్రభాస్ కు పడలేదు. బహుబలి తర్వాత చేసిన సాహో, రాదేశ్యామ్, ఆదిపురుష్ మూడు సినిమాలు నిరాశ పరిచాయి. ఇప్పుడు ఆయన ఆశలన్నీ సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ప్రభాస్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ సమయంలో అంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు ప్రభాస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్.. బహుబలి సిరీస్ తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టలేదు. బహుబలి 1 అండ్ 2 సినిమాల తర్వాత ప్రభాస్.. సుజిత్ సింగ్ డైరెక్షన్ లో సాహో చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం చేశాడు. అదే రాధే శ్యామ్. ఈ సినిమాతో మళ్లీ పాత ప్రభాస్ ను చూడాలి అని అనుకున్నారు అంతా. కానీ ఆ సినిమాపై చాలా విమర్శలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద కూడా ఆశించిన స్థాయి కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

Prabhas Hanu Raghavapudi Love Story Movie Budget rs300 Crores Full Details Here

ఇక ఆ తర్వాత ఎన్నో అంచనాల నడుమ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో పౌరాణిక చిత్రం ఆదిపురుష్ చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

Prabhas Hanu Raghavapudi Love Story Movie Budget rs300 Crores Full Details Here

ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా, మారుతి దర్శకత్వంలో రాజా డిలాక్స్ ( వర్కింగ్ టైటిల్) సినిమాలు కూడా చేస్తున్నాడు ప్రభాస్. సినిమా రిలీజ్ అయితే.. బ్రేక్ ఇవ్వడానికి ప్రభాస్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. ఇదిలా ఉంటే... ఇప్పుడు ప్రభాస్ మరో మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. సీతారామం దర్శకుడు హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు ఎప్పటినుంచో తెలిసిన విషయమే.

Prabhas Hanu Raghavapudi Love Story Movie Budget rs300 Crores Full Details Here

ఇక ప్రభాస్ హను రాఘవపూడి సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమా వరల్డ్ వార్ నేపథ్యంలో ఉండబోతుందట. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టుకు నిర్మించనుందని సమాచారం. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం.. ప్రభాస్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి కూడా ఈ సినిమా కోసం అడ్వాన్స్ తీసుకున్నారట. డిసెంబర్లో ఈ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

ఈ విషయం తెలుసుకున్ననెటిజన్స్.. మళ్లీ ప్రభాస్ అదే తప్పు చేస్తున్నారని అంటున్నారు. ఇంత ఖర్చు అవసరమా అంటున్నారు. రూ.30 కోట్ల రూపాయలతో హనురాఘవపూడి సీతారామం అనే అద్భుతమైన ప్రేమకథ చిత్రం తెరెక్కించారు. ఇప్పుడు ఓ అందమైన ప్రేమకథకు రూ.300 కోట్లు అవసరమా అని అంటున్నారు. రాదేశ్యామ్ సినిమా 300 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తే.. ఏం జరిగిందని గుర్తు చేస్తున్నారు. అలాంటి రిస్కులు చేయవద్దని.. మంచి ప్రేమకథ చిత్రంలో ప్రభాస్ ను డార్లింగ్ లుక్ లో చూడాలని కోరుకుంటున్నారు. చూడాలిమరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X