పెళ్లికి రెడీ అయిపోయిన ప్రభాస్ లవర్.. బిజినెస్ మ్యాన్‌తో పీకల్లోతు ప్రేమలో..!

ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సిద్ధు ఫ్రం శ్రీకాకులం సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయం అయింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికీ ఈ భామకు ఈ మధ్య కాలంలో ఆఫర్లు లేవు. అయినా సోషల్ మీడియాలో అందాల ఆరబోత మాత్రం మామూలుగా ఉండటం లేదు. అయితే ఇదిలా ఉంటే... ఈ భామ ఓ బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ భామ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హీరోయిన్ శ్రద్ధా దాస్.. తెలుగు తెరకు అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రం శ్రీకాకులం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాలు ఆఫర్లు వచ్చాయి. ఇక అల్లు అర్జున్ తో ఆర్య 2 సినిమాలో ఆర్యను ప్రేమించే అమ్మాయిగా కనిపించింది. ఇక ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ తో కలిసి డార్లింగ్ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లవర్ గా అలరించింది.

Prabhas Heroine Shraddha das Love Marriage With Businessman rumours goes viral

ఒక్క తెలుగు సినిమాలే కాకుండా ఈ భామ హిందీ, బెంగాలి, కన్నడ చిత్రాలు కూడా చేసింది. ఇక ఆ మధ్య ఏక్ మినీ కథలో కనిపించింది. ఆ తర్వాత గత ఏడాది నిరీక్షణ చిత్రంలో నటించింది. ఇక ఈ భామకు ఇండస్ట్రీలో పెద్ద ఆఫర్లు లేవనే చెప్పాలి. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను, నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తన అందాలు ఆరబోస్తూ.. నెటిజన్స్ ను కవ్విస్తుంది.

ఇదిలా ఉంటే.. శ్రద్దా దాస్ బుల్లితెర షోలు చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. ఢీ గ్లామర్, గ్లామర్, ఎక్స్ట్రా డోస్ క్యారెక్టర్లు కూడా చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ... సరైన అవకాశాలు రావడం లేదు. సినిమాల్లో, వెబ్ సిరీస్ ల్లో ఆడపా దడపా కనిపిస్తూ.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ హాట్ బ్యూటీ.... సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులకు, కుర్రకారుకు టచ్ లో ఉంటుందనే విషయం తెలిసిందే.

Prabhas Heroine Shraddha das Love Marriage With Businessman rumours goes viral

ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను నిత్యం అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఓ బిజినెస్ మాన్ తో ఈ భామ ప్రేమలో పడిందట. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు అతన్ని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది. సమ్మర్లో వీరి వివాహం కూడా జరగనుందని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ భామ త్వరలోనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X